Begin typing your search above and press return to search.

అజిత్ తునివు.. తెలుగు టైటిల్ ఏమిటంటే!

By:  Tupaki Desk   |   21 Dec 2022 3:30 PM GMT
అజిత్ తునివు.. తెలుగు టైటిల్ ఏమిటంటే!
X
తమిళ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో అజిత్ ఒకరు. ఇప్పుడు విజయ్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ మధ్యలో ఫైట్ అయితే ఒక రేంజ్ లో కొనసాగుతోంది. ఇక వీరి సినిమాలు కూడా సంక్రాంతికి పోటీ పడుతూ ఉండడంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. వారసుడు, తునివు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా అజిత్ అయితే ప్రతిసారి తన ప్రతి సినిమాతో ఈజీగా 100 కోట్ల మార్కెట్ అయితే అందుకుంటూ ఉన్నాడు. ఇక ఈసారి కూడా తునివు సినిమాతో అదే తరహాలో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన బజ్ అయితే అంత ఎక్కువగా కనిపించడం లేదు. విజయ్ మళ్ళీ ఎప్పటిలానే వారసుడు సినిమాతో కొంత హైప్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాడు.

ఇక తెలుగులో కూడా అజిత్ తునివు సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. తెలుగులో ఎలాంటి టైటిల్ సెట్ చేసారు అని వివరాల్లోకి వెళితే, కొద్దిసేపటికి క్రితమే అధికారికంగా తెలుగు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు తెలుగులో 'తెగింపు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తునివు అంటే తమిళంలో దృఢత్వం అని అర్థం. ఇక దాదాపు అదే తరహాలో అర్థం వచ్చేలా తెగింపు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా విజయ్ వారసుడు సినిమాతో పోటీపడుతూ ఈ సినిమాను కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు.

కానీ దిల్ రాజు అజిత్ సినిమా కంటే ఎక్కువ థియేటర్స్ లలో వారసుడు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలు తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.