Begin typing your search above and press return to search.

తెగింపు వచ్చేస్తోంది.. మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   22 Jan 2023 5:31 AM GMT
తెగింపు వచ్చేస్తోంది.. మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?
X
సంక్రాంతి సందర్భంగా ఈ సారి తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలతో పాటు... ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యాయి. అయితే తమిళంలో కూడా ఇద్దరు బడా స్టార్ల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అజిత్ కుమార్ హీరోగా తునివు, విజయ్ హీరోగా వారిసు అనే సినిమాలు తమిళంలో రిలీజ్ అయ్యాయి. అదే సినిమాలను తెలుగులో అజిత్ కుమార్​ తెగింపు, విజయ్ వారసుడు పేరుతో రిలీజ్ చేశారు.

అయితే తెలుగు సినిమాలు సూపర్ హిట్ దక్కించుకోగా రెండు తమిళ సినిమాలకు మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపించలేదు. కానీ రెండు తెలుగు సినిమాల తర్వాత వారసుడు సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమాకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు రిలీజ్ అయిన తెగింపు మాత్రం కలెక్షన్స్ విషయంలో బాగా వెనుకబడిపోయింది. ఎలాంటి సినిమాలు లేని సమయంలో ముందుగా రిలీజ్ అయిన తెగింపు సినిమా మొదటిరోజు కలెక్షన్స్ బాగానే రాబట్టింది. కానీ తర్వాతి రోజు వీర సింహారెడ్డి ఎంట్రీ తర్వాత వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి సినిమాలు ఎంట్రీతో పూర్తిగా కలెక్షన్స్ అనే మాటే మరిచిపోయింది.

ఇక తాజాగా ఈ సినిమాని డిజిటల్ వేదికగా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ రెండు భాషల్లో డిజిటల్ రిలీజ్ కూడా చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన నెట్​ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలకు కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక వారిసు తమిళ వెర్షన్ కూడా అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు కానీ తెలుగు వెర్షన్​కి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఒక రకంగా తెగింపు సినిమా సహా వారీసు థియేటర్ల నుంచి డిజిటల్​లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.