Begin typing your search above and press return to search.

అజిత్ కూడా సంబంధం లేదన్నాడు

By:  Tupaki Desk   |   20 Aug 2017 2:48 PM IST
అజిత్ కూడా సంబంధం లేదన్నాడు
X
తమిళ అభిమానుల అతి ఏ రేంజులో ఉంటుందనేది మనం వారి ట్విట్టర్ యుద్దాలను చూసి నేర్చుకోవచ్చు. భారతంలో కురుక్షేత్రం గురించి చెప్పడానికి ఎన్ని పర్వాలు అవసరం అయ్యాయో ఇప్పుడు తమిళ స్టార్స్ విజయ్ అండ్ అజిత్ ల యుద్దం గురించి వివిరించడానికి కూడా అంతకంటే ఎక్కువ పర్వాలే కావాలి. కాని ఈ మొత్తం యుద్దానికీ తమకూ సంబంధంలేదని ఈ స్టార్లు సింపుల్ గా షాకిస్తూ అభిమానులను ఆశ్చర్యపోయేలా చేశారు.

మొన్నటికిమొన్న ఒక లేడీ జర్నలిస్ట్ విషయంలో విజయ్ ఫ్యాన్స్ నానా బీభత్సం సృష్టించేశారు. విజయ్ సినిమాను పోలుస్తూ ఒక బాలీవుడ్ సినిమా గురించి చెప్పడంతో వారికి కోపమొచ్చి రేప్ చేస్తాం అంటూ వార్నింగులు ఇచ్చారు. అలా చేయకండి అంటూ విజయ్ తరువాత ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇస్తూ.. అసలు అలా చేసేవారికి తనకూ సంబంధం లేదన్నట్లు చెప్పేశారు. ఇప్పుడైతే అజిత్ అంతకంటే ఒకడుగు ముందుకు వేసి.. ఏకంగా లీగల్ నోటీస్ ఇచ్చాడు.

నా పేరు వాడుకుని మీరు ఎవరినైనా కామెంట్ చేయడం లేదంటే చెత్తగా అభివర్ణించడం చేస్తే మాత్రం యాక్షన్ తప్పదు. అసలు అలాంటివారు నా ఫ్యాన్స్ కానేకాదు అంటూ లీగల్ గా తన లాయర్ల ద్వారా లెటర్ పంపాడు. మొత్తానికి అనవసరంగా హీరోల అభిమానులమంటూ ట్విట్టర్లో గొడవలు పెట్టుకుంటూ ఇతరులను దూషిస్తే ఇక పోలీసుల నుండి భజన తప్పదుమరి. జాగ్రత్త బాబులూ!!