Begin typing your search above and press return to search.

నన్ను 'తల' అని పిలవొద్దని అజిత్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:30 PM
నన్ను తల అని పిలవొద్దని అజిత్ సంచలన ప్రకటన
X
మన సినీ పరిశ్రమలో నటీనటుల పేర్ల ముందు కొన్ని ట్యాగ్‌లు/ప్రిఫిక్స్‌లు ఉపయోగించడం సర్వసాధారణం. 'సూపర్‌స్టార్‌' రజనీకాంత్‌, 'ఇలయ దళపతి' విజయ్‌లానే అభిమానులు, మీడియా అజిత్‌ని 'తల' అజిత్ అని పిలుచుకుంటారు. అయితే, నటుడు తన పేరుకు ముందు 'తల' లేదా మరేదైనా బిరుదులను ఉపయోగించవద్దని తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రతి ఒక్కరినీ అభ్యర్థించాడు.

అజిత్‌ని అజిత్, అజిత్ కుమార్ లేదా కేవలం ఎకె అని పిలవాలని కోరాడు.. కానీ, తల అని పిలవడానికి ఇష్టపడకపోవడానికి నటుడు ఎటువంటి కారణం చెప్పలేదు.

"గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజలకు.. నిజమైన అభిమానులకు విన్నపం. నేను ఇకనుండి అజిత్, అజిత్ కుమార్ లేదా జస్ట్ ఎకె అని మాత్రమే పిలవండి. "తల" లేదా మరేదైనా నా పేరు బిరుదుగా వాడకండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, విజయం, మనశ్శాంతి.. సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని అజిత్ తన ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం అజిత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అజిత్ తదుపరి చిత్రం వాలిమై. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.