Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మీద మోజు పడుతున్న అజిత్..!

By:  Tupaki Desk   |   21 Jan 2022 5:08 AM GMT
హైద‌రాబాద్ మీద మోజు పడుతున్న అజిత్..!
X
తమిళంతో పాటుగా తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ నటించిన సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్ లో అజిత్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన హీరోగా నటించిన సినిమాలన్నింటిని డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో స్టార్ హీరో నటించిన ''వాలిమై'' చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే అజిత్ కుమార్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. తన సినిమాల షూటింగ్స్ దాదాపుగా ఇక్కడే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్.. చెన్నై టూ హైదరాబాద్ రైడింగ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎంతైనా సొంతూరు క‌దా.. అందుకే జంట నగరాల మీద అగ్ర కథానాయకుడికి అంత అఫెక్షన్ ఉండి ఉండొచ్చు. వాస్త‌వానికి అజిత్ కి హ‌బ్సీగూడాలో రెండు కమర్షియల్ కాంప్లెక్సులు కూడా ఉన్నాయని సమాచారం.

ఇది కాసేపు ప‌క్క‌న పెడితే అజిత్ లేటెస్ట్ మూవీ 'వలిమై' సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే జరిగింది. ఇప్పుడు తదుపరి మూవీ '#AK61' కు సంబంధించిన షూట్ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే మార్చి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట.

అజిత్ 61వ సినిమాని కూడా హెచ్ వినోద్ తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మించనున్నారు. 'నెర్కొండ పార్వై' 'వాలిమై' తర్వాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో 'బిల్లా' 'గ్యాబ్లింగ్' తరహా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్ కనిపించనున్నారని టాక్. 'వాలిమై' రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెళ్లడికానున్నాయి.

కాగా, ''వలిమై'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేయగా.. కరోనా ఉధృతి నేపథ్యంలో వాయిదా వేశారు. తదుపరి రిలీజ్ డేట్ ని పరిస్థితులను బట్టి ఖరారు చేయనున్నారు.

అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో 'కాలా' ఫేమ్ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా న‌టిస్తోంది. 'Rx100' హీరో కార్తికేయ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి 'వాలిమై' సినిమా అజిత్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.