Begin typing your search above and press return to search.

కాట‌మ‌రాయుడు కోసం అజిత్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   18 March 2017 8:27 AM GMT
కాట‌మ‌రాయుడు కోసం అజిత్ ఫ్యాన్స్
X
త‌మిళ‌నాట అజిత్‌ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ పై ఉన్న క్రేజ్‌ కీ - త‌మిళం ప్రేక్ష‌కుల్లో అజిత్‌ పై ఉన్న క్రేజ్‌ కి చాలా దగ్గ‌రి పోలిక‌లు ఉంటాయి కూడా. అందుకే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ సినిమాకి అజిత్ ఫ్యాన్స్ విష్ చేశారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో `కాట‌మ‌రాయుడు` మేనియా క‌నిపిస్తోంది. వ‌చ్చే శుక్ర‌వారమే ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుండ‌డం, ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే పండగ వాతావ‌ర‌ణంలోకి వెళ్లిపోయారు. ఎక్క‌డ చూసినా పీకే పీకే అంటూ సంద‌డి చేస్తున్నారు. అన్న‌ట్టు కాట‌మ‌రాయుడు మేనియా కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కాకుండా ప‌క్క రాష్ట్రాల‌కీ పాకింది.

ముఖ్యంగా త‌మిళ‌నాడులో కాట‌మ‌రాయుడు అవ‌తారంలో ఉన్న ప‌వ‌న్ ఫ్లెక్సీలు పెద్ద‌యెత్తున క‌నిపిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలు పెట్టింది కూడా ఎవ‌రో కాదు... అజిత్ ఫ్యాన్స్‌. త‌మిళంలో అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన వీర‌మ్ సినిమానే తెలుగులో కాట‌మ‌రాయుడు పేరుతో రీమేక్ చేశారు. అందుకే అజిత్ ఫ్యాన్స్ కాట‌మ‌రాయుడుని మరింత ఓన్ చేసుకొని విష్ చేస్తున్నారు. టెంపుల్ సిటీ మ‌ధురైకి చెందిన అజిత్ ఫ్యాన్స్ అక్క‌డ ప‌వ‌న్‌ - అజిత్‌ ల‌తో కూడిన ఫ్లెక్సీల‌ని ఇలా వీధుల్లో ఆవిష్క‌రించి కాట‌మ‌రాయుడుకి గ్రాండ్‌గా వెల్క‌మ్ చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీల్ని ఆన్‌ లైన్‌ లో చూస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగు రాష్ట్రాల అభిమానులు మ‌రింత ఖుషీ అవుతున్నారు. ఈసారి అజిత్ సినిమా తెలుగులో విడుద‌లైతే ఈ రేంజిలో ఆయ‌న‌కీ విష్ చేయాల‌ని చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/