Begin typing your search above and press return to search.

పవన్ సినిమా కోసం ఆ హీరో ఫ్యాన్స్ తహతహ

By:  Tupaki Desk   |   21 March 2017 11:23 AM GMT
పవన్ సినిమా కోసం ఆ హీరో ఫ్యాన్స్ తహతహ
X
తమిళ హీరోల సినిమాల్ని మనం నెత్తిన పెట్టుకోవడమే కానీ.. తెలుగు సినిమాల్ని తమిళ ప్రేక్షకులు పట్టించుకోవడం అరుదు. ‘బాహుబలి’ లాంటి స్పెషల్ మూవీస్ ను పక్కనబెట్టేస్తే మన సినిమాలపై తమిళ ప్రేక్షకుల ఫోకస్ పెద్దగా ఉండదు. మన స్టార్ల సినిమాలకు తమిళనాట ఉన్న తెలుగు వాళ్ల నుంచి రెస్పాన్స్ బాగానే ఉంటుంది కానీ.. తమిళ జనాలు మన సినిమాల్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’పై తమిళ ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటం విశేషం. ముఖ్యంగా అజిత్ అభిమానులు ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా సహకరిస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపైన్ కూడా నడుపుతున్నారు.

‘కాటమరాయుడు’ అజిత్ సినిమా ‘వీరం’కు రీమేక్ కావడం ఇందుకు కారణం. తమ హీరో సినిమాను రీమేక్ చేశారన్న అభిమానంతో ‘కాటమరాయుడు’కు తమిళనాట మంచి హైప్ తీసుకొస్తున్నారు అజిత్ అభిమానులు. ఏ తెలుగు సినిమా కూడా లేని స్థాయిలో ‘కాటమరాయుడు’ తమిళనాట 150 థియేటర్లలో రిలీజవుతుండటానికి అజిత్ అభిమానులే కారణమని ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నరేంద్రన్ తెలిపాడు. వాళ్లు ‘కాటమరాయుడు’ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారని.. ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సహకరిస్తున్నారని.. ప్రమోషన్లకు కూడా తోడ్పాటు అందిస్తున్నారని.. 24న ఉదయం బెనిఫిట్ షోలకు కూడా అజిత్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారని అతను వ్యాఖ్యానించాడు. ఇలా తమ హీరో సినిమాను రీమేక్ చేశారన్న అభిమానంతో ఓ తెలుగు సినిమాకు తమిళ అభిమానులు ఇంత ప్రయారిటీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/