Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య చిచ్చు పెట్టింది

By:  Tupaki Desk   |   4 March 2019 9:23 AM GMT
స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య చిచ్చు పెట్టింది
X
బాలీవుడ్‌ లో కొన్నాళ్ల క్రితం హీరోయిన్‌ గా మెప్పించిన ముద్దుగుమ్మ ఇషా కొప్పికర్‌. టాలీవుడ్‌ లో కూడా ఈమె అడపా దడపా చిత్రాలు చేసింది. కాని ఈమెకు ఆశించిన స్థాయిలో టాలీవుడ్‌ లో గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌ లో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఇషా తాజాగా ఒక తమిళ చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యింది. తమిళ హీరో శివ కార్తికేయన్‌ సినిమాలో ఇషా కొప్పికర్‌ నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమా గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఇషా కొప్పికర్‌ తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసి విమర్శల పాలు అవ్వడంతో పాటు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య ఫైట్‌ కు ఆజ్యం పోసింది.

తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ మరియు అజిత్‌ ల ఫ్యాన్స్‌ మద్య ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో సోషల్‌ మీడియాలో ఫైట్‌ జరుగుతూనే ఉంటుందనే విషయం తెల్సిందే. తాజాగా ఆ ఇద్దరు హీరోల గురించి ఇషా కొప్పికర్‌ మాట్లాడటంతో ఫ్యాన్స్‌ మద్య వివాదం మొదలు అయ్యింది. అజిత్‌ గురించి ఇషా మాట్లాడుతూ ఒకప్పుడు స్టార్‌ హీరో అయిన అజిత్‌ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారా అనే విషయం కూడా తెలియడం లేదు అంది. అంటే అజిత్‌ వరుసగా ఫ్లాప్స్‌ అవుతు వస్తున్నాడు. ఆయన కెరీర్‌ ముగిసినట్లే అనేది ఇషా అభిప్రాయం.

ఇక విజయ్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ నెం.1 హీరో అంటూ వ్యాఖ్యలు చేసింది. అజిత్‌ ను అవమానపర్చుతూ ఆమె చేసిన విమర్శలు ప్రస్తుతం కోలీవుడ్‌ లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అజిత్‌, విజయ్‌ ల ఫ్యాన్స్‌ మద్య సోషల్‌ మీడియా కామెంట్స్‌ మొదలు అయ్యాయి. ఇషా కొప్పికర్‌ వ్యాఖ్యలను విజయ్‌ ఫ్యాన్స్‌ పోస్ట్‌ చేస్తుంటే, విజయ్‌ మరియు ఇషాలపై విమర్శలు చేస్తూ అజిత్‌ ఫ్యాన్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఈ సోషల్‌ మీడియా వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.