Begin typing your search above and press return to search.

'వాలిమై అప్డేట్ ఎప్పుడు..?' ఫ్యాన్స్ ఎవ్వరిని వదలట్లేదు!

By:  Tupaki Desk   |   22 Jun 2021 2:30 AM GMT
వాలిమై అప్డేట్ ఎప్పుడు..? ఫ్యాన్స్ ఎవ్వరిని వదలట్లేదు!
X
సినీ ఇండస్ట్రీలో సౌత్ ప్రేక్షకులు.. స్టార్ హీరోలు అంటే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలోనే హీరోలకు.. అభిమానులకు మధ్య అనుబంధం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కోసారి ఆ అభిమానం పీక్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమైనా చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఆ పిచ్చిలోనే అప్పుడప్పుడు కొన్ని క్రేజీ పనులు కూడా చేస్తుంటారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ ఫ్యాన్స్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పెద్దచర్చకే తెరలేపారు. అదికూడా టీవీలో సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఏకంగా విషయాన్నీ క్రికెటర్స్ దృష్టిలో పడేలా చేశారు. మరి అలా ఎందుకు చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

అజిత్ ప్రస్తుతం వాలిమై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి గతేడాది లాక్డౌన్ పడినప్పుడు నుండి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు వాలిమై చిత్రబృందం. అందులోను తలా అజిత్ సినిమా అంటే ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు. చాలా నెలలు ఓపిక పట్టి ఏకంగా చెన్నైలో జరిగిన రీసెంట్ ఇండియా - ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టైంలో 'వాలిమై అప్డేట్ ఎప్పుడు?' అని రాసి ప్లకార్డులు పట్టుకొని క్రికెటర్స్ వైపు క్వశ్చన్ చూపించారు. అయితే ఈ విషయాన్ని స్టార్ బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ ప్రాక్టీస్ టైంలో గమనించి తన యూట్యూబ్ వ్లాగ్స్ లో ప్రస్తావించాడు.

తాజాగా అదే ప్రశ్నను మళ్లీ న్యూజీలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ ప్రాక్టీస్ టైమ్ లో ప్రశ్నించడం గమనార్హం. ప్రస్తుతం ఇండియా టీమ్ న్యూజీలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఆడుతోంది. అయితే వాలిమై అప్డేట్ ఎప్పుడు అనే క్వశ్చన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తున్నారు తలా ఫ్యాన్స్. మరి ఈ విషయం వాలిమై చిత్రబృందం దృష్టికి వెళ్లిందో లేదో గాని ఖచ్చితంగా చూస్తే మాత్రం స్పందించి తీరుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తలా అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాలిమై సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోణికపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హ్యుమాఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది.