Begin typing your search above and press return to search.

ఇడ్లి అభిమానం 57 కేజీలు

By:  Tupaki Desk   |   24 Aug 2017 9:18 AM GMT
ఇడ్లి అభిమానం 57 కేజీలు
X
అభిమానులు స్టార్స్ పై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపించుకుంటారు. ఇండియాలో ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎవరి స్థాయిలో వారు అభిమానుల్ని సంపాందించుకున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీలో లో మాత్రం ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతి హీరోకి అక్కడ అభిమాన సంఘాలు అతిగానే ఉన్నాయి.

అయితే కోలీవుడ్ లో రజినీ తర్వాత ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈ రోజు ఆయన సినిమా "వివేగం" ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇక ఆయన అభిమానులు ఈ వేడుకను ఒక పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగులో వివేకం పేరుతో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. అయితే వేడుకల్లో భాగంగా అజిత్ కెరీర్ లో ఇది 57వ చిత్రం కావడంతో నార్త్‌ మద్రాస్‌ కు చెందిన వీర చెన్నై అజిత్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ ఆలోచనతో 57 కిలోల బరువైన ఇడ్లీని అజిత్ ఆకృతి లో తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తమిళనాడు సమైయల్‌ కలై తాలజాలర్‌ మున్నేట్ర సంఘం కార్యదర్శి ఇనియావన్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

తమిళనాడులో ఇడ్లి-సాంబార్ ఎంత ఫెమాస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరిపైన అయినా ప్రేమ కలిగితే ఈ విధమైన ఇడ్లి ప్రేమను చాటుకుంటారు అక్కడి అభిమానులు. ఇదే తరహాలో ఇంతకుముందు అబ్దుల్‌ కలాం - మదర్‌ థెరిస్సా - జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి వారికి వారి ఇడ్లి ప్రేమను చాటుకున్నారు.