Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడిపై స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఆగ్రహం

By:  Tupaki Desk   |   4 Nov 2018 3:30 PM GMT
ఆ దర్శకుడిపై స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఆగ్రహం
X
తమిళ స్టార్‌ హీరోలు అనగానే అజిత్‌ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అయితే అజిత్‌ స్టార్‌ డం మెల్లమెల్లగా తగ్గుతుందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకు కారణం అజిత్‌ ఈ మద్య వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవ్వడమే. ముఖ్యంగా శివ దర్శకత్వంలో అజిత్‌ చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పర్చుతున్నాడు. ఇప్పటికే వివేకం చిత్రంతో అజిత్‌ కెరీర్‌ లోనే పెద్ద ఫ్లాప్‌ ఇచ్చిన శివ ప్రస్తుతం అజిత్‌ తో విశ్వాసం చేస్తున్నాడు.

తాజాగా ‘విశ్వాసం’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. ఫస్ట్‌ లుక్‌ పై విమర్శకులు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. యాంటీ అజిత్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఫస్ట్‌ లుక్‌ పై ట్రోల్స్‌ చేశారు. అజియ్‌ ఫ్యాన్స్‌ కూడా ఏమాత్రం ఫస్ట్‌ లుక్‌ పై సంతృప్తిని వ్యక్తం చేయలేదు. ‘విశ్వాసం’ సంక్రాంతికి రాబోతుంది అంటే ప్రేక్షకుల్లో మరియు అజిత్‌ ఫ్యాన్స్‌ లో ఏమాత్రం ఆసక్తి లేదు. సంక్రాంతికి విశాల్‌ మూవీ విడుదల కాబోతుంది. అజిత్‌ మూవీ కంటే విశాల్‌ మూవీకే ఎక్కువ క్రేజ్‌ ఉంది. అజిత్‌ విశ్వాసం కూడా ఫ్లాప్‌ అయితే మరింత నష్ట పోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే అజిత్‌ అభిమానులు దర్శకుడు శివపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఒకప్పుడు స్టార్‌ - సూపర్‌ స్టార్‌ గా ఉన్న అజిత్‌ ను ఒక మామూలు హీరోగా మార్చేశాడని, ఇప్పటికైనా శివను అజిత్‌ దూరం పెట్టాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఒక్క సినిమాతో సక్సెస్‌ ఇచ్చినందుకు వరుసగా ఆయనతో సినిమా చేయాల్సిన అవసరం లేదని, మంచి కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలంటూ అజిత్‌ ను ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరోసారి అజిత్‌ తో సినిమా చేస్తే శివపై ఫ్యాన్స్‌ దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.