Begin typing your search above and press return to search.

అదేంటీ అజిత్ డైరెక్ట‌ర్ అలా అనేశాడు!

By:  Tupaki Desk   |   19 Dec 2022 2:30 AM GMT
అదేంటీ అజిత్ డైరెక్ట‌ర్ అలా అనేశాడు!
X
ఇక టాప్ హీరోతో సినిమా చేస్తూ అదే హీరో సినిమాకు పోటీగా బ‌రిలోకి దిగుతున్న సినిమానే ముందు చూస్తాన‌ని అన‌డానికి గ‌ట్స్ వుండాలి. డైరెక్ట్ చేసిన హీరో సినిమా చూడ‌కుండా పోటీలోకి దిగుతున్న హీరో సినిమానే ముందు చూస్తానంటే హీరో ఫ్యాన్స్ అంత ఈజీగా ఊరుకోరు. పెద్ద ర‌చ్చ చేస్తారు.. నెట్టింట ట్రోలింగ్ కు తెర లేపుతారు. డైరెక్ట‌ర్ పై నానా ర‌చ్చ చేస్తారు. ఈ విష‌యం తెలిసి ఇలాంటి సాహ‌సోపేత‌మైన స్టేట్ మెంట్ లు ఇవ్వ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్స్ సాహ‌సించ‌రు.

కానీ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ హెచ్‌. వినోద్ మాత్రం షాకింగ్ స్టేట్ మెంట్ ఇవ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. త‌ల అజిత్ హీరోగా న‌టిస్తున్న హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `తునీవు`. బోనీ క‌పూర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంజు వారియ‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని తెలుగులో `తెగింపు` అనే పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. `

ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని 2023 జ‌న‌వ‌రి 11న సంక్రాంతికి త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. హోచ్. వినోద్ డైరెక్ష‌న్ లో అజిత్ హీరోగా న‌టిస్తున్న మూడ‌వ సినిమా ఇది. రీసెంట్ గా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వ‌లిమై`. దీని త‌రువాత హై రేంజ్ లో వ‌స్తున్న మూవీ `తునీవు`. ఈ మూవీతో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న `వారీసు` జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతోంది. ఇదే మూవీని తెలుగులో `వార‌సుడు`గా రిలీజ్ చేస్తున్నారు.

`వారీసు`తో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ నాట అజిత్ `తునీవు`కు గ‌ట్టి పోటీనివ్వ‌బోతున్నాడు. ఇద్ద‌రి సినిమాలు కేవ‌లం ఒక్క లేజు తేడాతో రిలీజ్ కాబోతున్నాయి. అయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. ఈ పోటీ ఫ్యాన్స్ మ‌ధ్య కూడా పీక్స్ లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా అజిత్‌, విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అజిత్ తో `తునీవు` మూవీని రూపొందించిన డైరెక్ట‌ర్‌ హెచ్ వినోద్ త‌ను మాత్రం ముందు విజ‌య్ `వారీసు`నే చూస్తాన‌ని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ ఇంట‌ర్వ్యూలో ముందు `తునీవు`ని చూస్తారా? .. లేక విజ‌య్ న‌టిస్తున్న `వారీసు`ని చూస్తారా? అని అడిగితే త‌ను రూపొందించిన `తునీవు` సినిమాని చాలా సార్లు చూశాన‌ని, అందుకే ముందు విజ‌య్ సినిమాని చూడాల‌ని అనుకుంటున్నాన‌ని హెచ్ వినోద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే `తునీవు` జ‌న‌వ‌రి 11న విడుద‌ల కాబోతుండ‌గా, విజ‌య్ న‌టిస్తున్న `వారీసు` జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతోంది.