Begin typing your search above and press return to search.

తెలుగు రీమేక్ లో త‌ళా అజిత్ కూతురు

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:30 AM GMT
తెలుగు రీమేక్ లో త‌ళా అజిత్ కూతురు
X
మ‌ళ‌యాలం నుంచి ముద్దుగుమ్మ‌ల వెల్లువ ఆగ‌డం లేదు. టాలీవుడ్ లోకి నిరంత‌ర ప్ర‌వాహం కొన‌సాగుతోంది. ఇప్పుడున్న న‌టీమ‌ణుల్లో నిత్యామీన‌న్ - నివేద థామ‌స్- కీర్తి సురేష్‌- సాయిప‌ల్ల‌వి- అమ‌లాపాల్ బిజీ నాయిక‌లుగా వెలిగిపోతున్నారు. ఇప్పుడు మ‌రో మ‌ల‌యాళీ యువ‌క‌థానాయిక తెలుగులో పెద్ద అవ‌కాశాలు అందుకుంటోంది.

`ఎన్నై అరిందాల్`.. `విశ్వాసం` సినిమాల్లో తళా అజిత్ కుమార్తెగా నటించిన మలయాళ యువ బ్యూటీ అనిఖా సురేంద్రన్ టాలీవుడ్ లో మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్ `కప్పెలా`లో ప్రధాన పాత్రలో నటించడానికి అనిఖా ఎంపికైంది. కప్పెల తెలుగు రీమేక్ కొన్ని నెలల క్రితం ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ- కైతి - మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కాకుండా నాగార్జున .. కాజల్ అగర్వాల్ న‌టిస్తున్న‌ యాక్షన్ థ్రిల్లర్ లో అనిఖా సురేంద్రన్ కూడా కనిపించనుంది. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది.