Begin typing your search above and press return to search.

అజిత్ వ్యాఖ్య‌లు సినిమా డైలాగుల్లా ఉన్నాయే!

By:  Tupaki Desk   |   27 Dec 2022 6:48 AM GMT
అజిత్ వ్యాఖ్య‌లు సినిమా డైలాగుల్లా ఉన్నాయే!
X
కోలీవుడ్ లో ఇల‌య త‌ల‌ప‌తి విజ‌య్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మిళ ఇండ‌స్ర్టీలో అత‌నో స్టార్ హీరో. టాప్ -5 జాబితాలో ఎప్పుడు ఉంటారు. అక్క‌డ ఎంత మంది హీరోలున్నా? అత‌నికంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానించే హీరో అత‌ను. 'వార‌సుడు' సినిమాతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ లో ఇదే సినిమా 'వారిసు'గా రిలీజ్ అవుతుంది. ఇటీవ‌లే అక్క‌డ ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జ‌రిగింది. ఇదే వేదిక‌పై ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

''1990లో ఒక నటుడు నాకు పోటీగా వ‌చ్చాడు. ఇంకా ఆ నటుడ నాకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు. బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్లినా అతను నాకు గట్టి పోటీనే. అతన్ని గెలవడానికి నేను ఇప్ప‌టికీ చాలా క‌ష్ట‌ప‌డుతున్నా.

ఆ నటుడు పేరే జోసఫ్ విజయ్' అని వ్యాఖ్యానించాడు. విజ‌య్ ఇలా వేదిక‌పై ఇంత సీన్..స‌స్పెన్స్ క్రియేట్ చేసే స‌రికి ఇదేదో వివాదాన్ని కెలుకుత‌న్న‌ట్లే క‌నిపించింది.

కానీ చివ‌రిగా అత‌ను పోటీ ప‌డుతుది త‌న‌తోనని రివీల్ చేయ‌డంతో అంతా ఒక్క‌సారిగా తుస్ మంది. జోసఫ్ విజయ్ అనేది విజయ్ అసలు పేరు. త‌న‌కు తానే పోటీ అని...ఇండ‌స్ర్టీలో తానే నెంబ‌ర్ వ‌న్ అన్న త‌ర‌హాలో చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఇయ‌ర్ లో అజిత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అత‌ని రేంజ్ గురించి తెలిసిందే. కోట్లా మంది ఫ్యాన్స్ ఉన్న హీరో.

కోలీవుడ్ లో ఇద్ద‌రి హీరోల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ట్టి పోటీ ఉంటుంది. ఆ ఇద్ద‌రి హీరోల అభిమాన సంఘాలు క‌య్యానికి కాలు దువ్వుతుంటాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గానూ ఇదే తంతు క‌నిపిస్తుంది. విజ‌య్ వ్యాఖ్య‌లు చూసి అజిత్ గురించి మాట్లాడుతున్నాడా? అని ముగింపు వ‌ర‌కూ సందేహం వెంటాడింది.

అయితే చివ‌రిగా ముగింపు చూసి ఇవి సినిమా డైలాగుల్లా ఉన్నాయంటూ కొంత మంది నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. అత‌ని గురించి అత‌నే గొప్ప‌గా చెప్పుకోవ‌డం అతిగానే ఉందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే అజిత్ 'తెగింపు'..'వార‌సుడు'కి పోటీగా సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న‌ నేప‌థ్యంలో మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య బాక్సాఫీస్ వార్ త‌ప్ప‌ద‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.