Begin typing your search above and press return to search.

త‌ళా- ద‌ళ‌పతి ఫ్యాన్స్ సోష‌ల్ వార్

By:  Tupaki Desk   |   21 Jun 2019 7:43 AM GMT
త‌ళా- ద‌ళ‌పతి ఫ్యాన్స్ సోష‌ల్ వార్
X
అభిమానుల మ‌ధ్య వార్ కాలంతో పాటే మారుతోంది. వాల్ పోస్ట‌ర్ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి .. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ పీక్స్ లో ఉండేది. అప్ప‌ట్లో ఫ్యాన్స్ యుద్ధం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకునేవారు. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య ఆ త‌ర‌హా వార్ కాకుండా బాక్సాఫీస్ లెక్క‌ల‌కు సంబంధించిన ఆరోగ్య‌క‌ర‌మైన వార్ కొన‌సాగింది. కొంత‌వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో అభిమానుల మ‌ధ్య టీజింగ్ ఉన్నా.. మ‌రీ టూమ‌చ్ అవ్వ‌లేదు. అప్ప‌ట్లోనే ప‌వ‌న్ ఫ్యాన్స్ .. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య భీమ‌వ‌రంలో బాహా బాహీ వార్ తో అగ్గి రాజుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే వీట‌న్నిటికీ డిఫ‌రెంట్ గా త‌మిళ‌నాట హీరోల‌ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం అభిమానుల మ‌ధ్య వార్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పీక్స్ కి చేరుకుంది. త‌ళా అజిత్ ఫ్యాన్స్ .. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఈనెల 22న విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ `ద‌ళ‌ప‌తి బిడే సీడీపీ` అంటూ ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ లో సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేశారు. అయితే దీనికి కౌంట‌ర్ గా అజిత్ ఫ్యాన్స్ `జూన్ 22 విజ‌య్ డెత్ డే` అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అయితే ఈ ప్ర‌చారానికి విజ‌య్ ఫ్యాన్స్ అంతే హ‌ర్ట‌యిపోయారు. తిరిగి త‌ళా అజిత్ ఫ్యాన్స్ పై కౌంట‌ర్ ని అదే రేంజులో ప్రిపేర్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

అజిత్ ఫ్యాన్స్ నెగెటివిటీని ప్ర‌చారం చేస్తే విజ‌య్ ఫ్యాన్స్ అందుకు భిన్న‌గా కాస్త హుందాగానే వ్య‌వ‌హ‌రించ‌డం ఇక్క‌డ కొస‌మెరుపు. `లాంగ్ లివ్ అజిత్ స‌ర్` అంటూ హ్యాష్ ట్యాగ్ తో ప్ర‌చారం చేస్తున్నారు విజ‌య్ ఫ్యాన్స్ . మొత్తానికి సోష‌ల్ మీడియా వార్ పిచ్చి పీక్స్ కి చేర‌డంతో దీనిపై జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఫ్యాన్స్ మ‌ధ్య కౌంట‌ర్లు చ‌ర్చ‌కొచ్చాయి. ద‌ళ‌ప‌తి బి డే సీడీపీ హ్యాష్ ట్యాగ్ .. అలానే లాంగ్ లివ్ అజిత్ స‌ర్ హ్యాష్ ట్యాగ్ రెండూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో నంబ‌ర్ 1.. నంబ‌ర్ 3 స్థానంలో ఇండియా లెవ‌ల్లో ట్రెండింగ్ అవ్వ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది.