Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో అవాకులు..నటుడి అరెస్ట్

By:  Tupaki Desk   |   19 April 2020 6:54 AM GMT
ఫేస్ బుక్ లో అవాకులు..నటుడి అరెస్ట్
X
ఫేస్ బుక్ లో అవాకులు చెవాకులు పేల్చిన ప్రముఖ నటుడు అరెస్ట్ అయ్యాడు. అనుచిత వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకున్నాడు. బిగ్ బాస్-7తో పాపులర్ అయిన.. రక్త చరిత్ర లో నటించిన ఎజాజ్ ఖాన్ ను తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎజాజ్ ఖాన్ ‘రక్త చరిత్ర’ సినిమాలో బుక్కారెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు.

శనివారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఎజాజ్ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ఎజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సెక్షన్ 135ఏతోపాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. తొలుత సమన్లు జారీ చేసిన పోలీసులు అతడిని ఆదివారం అరెస్ట్ చేశారు.

ఇక ఎజాజ్ ఖాన్ వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే.. గత ఏడాది జూలైలోనూ రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వీడియోలు పోస్ట్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. అలాగే డ్రగ్స్ వాడినందుకు 2018లో ఓ సారి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి నోరుజారి కటకటాలపాలయ్యాడు.