Begin typing your search above and press return to search.

మెగా హీరోకి ఫ్లాట్ అయిపోయిన విలన్

By:  Tupaki Desk   |   31 Aug 2017 5:05 PM GMT
మెగా హీరోకి ఫ్లాట్ అయిపోయిన విలన్
X
టాలీవుడ్ సినిమాల్లో కొత్త కొత్త విలన్స్ కనిపించడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు వినూత్నతను.. కొత్త టైపు విలనిజాన్ని చూపించేందుకు తాపత్రయపడే మన దర్శకులు.. పలు భాషల నుంచి విలన్స్ ను తీసుకొచ్చేస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ కు వచ్చిన వాడే అజయ్ ఘోష్ కూడా. అయితే.. చాలా మంది విలన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటారు కానీ.. అజయ్ ఘోష్ మాత్రం ఇక్కడే సెటిల్ అయేందుకు వీలుగా తన కెరీర్ మలుచుకుంటున్నాడు.

రీసెంట్ గా వెంకటాపురం మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు కూడా. అదే స్పీడ్ తో పెద్ద సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985లో కీలక పాత్రకు ఎంపిక అయిన అజయ్ ఘోష్.. ఆ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదే మూవీలో జగపతిబాబు కూడా నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ ప్రవర్తన చూసి షాక్ తినేశాడట అజయ్ ఘోష్. మెగాస్టార్ కుమారుడు అయినా.. అంత పెద్ద హీరో అయినా.. ఏ మాత్రం భేషజాలు లేకుండా యూనిట్ మెంబర్స్ తో ప్రవర్తిస్తున్న రామ్ చరణ్ ను చూసి విపరీతంగా ఆశ్చర్యపోయానని అంటున్నాడు అజయ్ ఘోష్.

తను ఇప్పటివరకూ ఇంతటి సింప్లిసిటీ ఉన్న హీరోను అస్సలు చూడనేలేదన్నది ఈ విలన్ మాట. ఇక రంగస్థలం మూవీ విషయానికి వస్తే.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. కానీ రిలీజ్ మాత్రం వచ్చే సమ్మర్ లోనే అనే టాక్ వినిపిస్తోంది.