Begin typing your search above and press return to search.

ఛార్టర్ట్ ఫ్లైట్ లో బాలీవుడ్ చక్కర్లు

By:  Tupaki Desk   |   8 Aug 2016 7:30 AM GMT
ఛార్టర్ట్ ఫ్లైట్ లో బాలీవుడ్ చక్కర్లు
X
అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్.. అజయ్ దేవగన్ కు జంటగా నటించిన చిత్రం శివాయ్. ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసి ఛార్టర్ట్ ఫ్లైట్ లో చక్కర్లు కొట్టేస్తున్నారు. అటు ప్రమోషన్స్ నుంచి చిన్నా చితకా కార్యక్రమాల వరకూ ఫ్లైట్ లోనే తిరిగేస్తున్నారు.

బాలీవుడ్ లో ఇలా ఛార్టర్ ఫ్లైట్ ఉపయోగించడం సాధారణం అయిపోయింది. రుస్తొం కోసం అక్షయ్ కుమార్.. దిల్ వాలే కోసం షారూక్ ఖాన్-కాజోల్ లు ఇలాగే తిరిగేశారు. ఇప్పుడు శివాయ్ సినిమా ప్రమోషన్ల కోసం అజయ దేవగన్ కూడా ఇలా స్పెషల్ ఫ్లయిటులోనే చక్కర్లు కొడుతున్నాడు. ఇదే మన టాలీవుడ్ లో అయితే హీరోలు ఛార్టర్ట్ ఫ్లైట్ లో తిరగడం సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఇలా ఛార్టర్డ్ ఫ్లైట్ ఉపయోగించడం ఇప్పుడు మొదలైందేమీ కాదు. పాతికేళ్ల క్రితమే గ్యాంగ్ లీడర్ 100 డేస్ ఫంక్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవి కోసం ఇలా ఫ్లైట్ తెప్పించి ఉపయోగించారు.

పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఛార్టర్డ్ ఫ్లైట్ ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. అయినా సరే మన దగ్గర ఇంకా పర్సనల్ ఫ్లైట్ వాడకం అంటే అదేదో బ్రహ్మ పదార్ధం అనే టైపులో ఆలోచిస్తుండడం ఆశ్చర్యకరమే.