Begin typing your search above and press return to search.

రాందేవ్ బాబాపై సినిమా.. హీరో ఎవరంటే?

By:  Tupaki Desk   |   29 Jun 2017 12:02 PM GMT
రాందేవ్ బాబాపై సినిమా.. హీరో ఎవరంటే?
X
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ముందు ఎక్కువగా స్పోర్ట్స్ బయోపిక్సే వచ్చేవి కానీ.. ఈ మధ్య రాజకీయ నాయకులు.. ఇతర రంగాకు చెందిన వ్యక్తుల జీవిత కథలు కూడా వెండి తెరకు ఎక్కుతున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు యోగా గురువు రామ్ దేవా బాబా జీవిత కథను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

వెండితెరపై రామ్ దేవ్ బాబా పాత్ర ఎవరు పోషించబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ బాబా పాత్రలో కనిపిస్తాడట. మామూలుగా రామ్ దేవ్ బాబాను.. అజయ్ దేవగన్ ను పక్క పక్కన పెట్టి చూస్తే ఇద్దరికీ పెద్దగా పోలికలు కనిపించరు. ఇద్దరూ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. పైగా అజయ్ దేవగన్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా రామ్ దేవ్ బాబా పాత్రకు సరిపోతారా అన్న సందేహాలు కూడా కలుగుతాయి. కానీ ఓ నిర్మాణ సంస్థ రామ్ దేవ్ పాత్రకు అజయే సరిపోతాడని ఫిక్సయింది. అతను కూడా ఈ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

ఒకప్పుడు చిన్న స్థాయి యోగా గురువుగా ఉన్న రామ్ దేవ్ బాబా.. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా ఎనలేని పేరు సంపాదించాడు. ప్రపంచ స్థాయిలోనూ ఖ్యాతి గడించాడు. మోడీ సర్కారు యోగాను అమితమైన ప్రాధాన్యం ఇవ్వడం.. యోగా డేను కూడా మొదలుపెట్టడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. యోగా ద్వారానే కాక ‘పతంజలి’ ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారాన్ని వేల కోట్ల టర్నోవర్ కు తీసుకెళ్లడం ద్వారా కూడా రామ్ దేవ్ బాబా బాగా ఫేమస్ అయ్యాడు. మరి వెండితెరపై ఆయన జీవితాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/