Begin typing your search above and press return to search.

హాలీవుడ్ స్టార్ ని స‌మోసా అనేసాడేంటి?

By:  Tupaki Desk   |   7 July 2022 12:30 PM GMT
హాలీవుడ్ స్టార్ ని స‌మోసా అనేసాడేంటి?
X
బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉత్త‌రాది న‌టుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న మాట‌ల‌కు బ‌ధులు చేతల్లో మాత్ర‌మే త‌న ప‌నిత‌నాన్ని చూపిస్తారు. బాలీవుడ్ లో ఆ ర‌కంగా స‌త్తా చాటిన ఏకైక న‌టుడాయ‌న‌. అందులో ఆయ‌న‌కి ఓ యూనిక్ స్టైల్ సైతం ఉంది. ఆ విష‌యంలో బాలీవుడ్ హీరోలే అజ‌య్ ని తెగ‌ పొగిడేస్తుంటారు. తాజాగా అజ‌య్ ఓ హాలీవుడ్ స్టార్ హీరోని ఏకంగా స‌మోసా తోనే పొల్చి వార్త‌ల్లోకి ఎక్కేసారు.

హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోన్న‌ మూవీ సిరీస్ 'అవెంజర్స్' గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే 28 సినిమాలు..7 వెబ్‌సిరీస్‌లు విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో చిత్రం 'థోర్: లవ్ అండఠ్ థండర్ విడుదలైంది. `థోర్` సిరీస్‌‌లో ఇది నాలుగవ సినిమా. ఇందులో మూవీలో క్రిస్ హేమ్స్‌వర్త్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో కొన్నినెలల క్రితం విడుదలై మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

ఆ ట్రైలర్‌లోని ఓ సీన్‌లో అజయ్ ఫేమస్ స్టంట్‌ని హేమ‌వ‌ర్త్ కాపీ కొట్టాడు. దానిపై అజయ్ దేవ్‌గణ్ సెటైరికల్‌గా స్పందించారు. రెండు టీ గ్లాసులపై పెద్ద సమోసా పెట్టిన‌ పిక్‌ని షేర్ చేశాడు. ఇలాంటి స్టంట్లు ఇంటివ‌ద్ద ప్ర‌య‌త్నించ‌డానికి చాలా చాలా సురక్షితం వ్య‌గ్యంగా స్పందించారు. ఇది నెట్టింట వైర‌ల్ గా మారింది. ట్రెండింగ్ లో నిలిచింది. ఇక అజ‌య్ అభిమానులుఎ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. నెట్టింట వేదిక‌గా అజ‌య్ అభిమానులు ఎవ‌రి స్టైల్లో వారు చెల‌రేగిపోతున్నారు.

అజయ్‌ మాత్రమే థోర్.. అజయ్ దేవ్‌గణ్ అభిమానిగా మారిపోయినట్టున్నాడని ఓ నెటిజ‌నుడు.. అజయ్‌ని థోర్ కాపీ కొట్టాడని మరొకరు రాసుకొచ్చారు. ఇంకొక‌రు అజయ్ పాత సినిమాలో సుత్తి పట్టుకున్న ఫోటో.. థోర్ సుత్తి పట్టుకున్న స్నాప్ ని షేర్ చేశాడు. దానికి కూడా `క్రిస్ హేమ్స్‌వర్త్ అజయ్ దేవ్‌గణ్ ఫ్యాన్ అయ్యింటాడు` రాసుకొచ్చారు.

ఈ కామెంట్లు నెట్టింట వైర‌ల్ గా మార‌డం ఓ ఎత్తైతే..అజ‌య్ ఏకంగా స‌మోసాతో ఆ హాలీవుడ్ స్టార్ ని పోల్చ‌డం మ‌రీ కించ ప‌రిచిన‌ట్లుగా ఉంద‌ని మ‌రికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఎంత కాపీ కొడితే మాత్రం ఓ న‌టుడ్ని అలా స‌మోసాతో పోల్చాలా? అంటూ అజ‌య్ కి వ్య‌తిరేక వ‌ర్గం వాదిస్తోంది.