Begin typing your search above and press return to search.

బాహుబలి టీమ్ కు అజయ్ షాకిచ్చాడు!!

By:  Tupaki Desk   |   19 Oct 2016 3:30 PM GMT
బాహుబలి టీమ్ కు అజయ్ షాకిచ్చాడు!!
X
మరో మూడు రోజుల్లో ''బాహుబలి'' సినిమా వారు ఒక పెద్ద ఫీట్ ను చేయబోతున్నారు. అయితే వారికంటే ముందే ఆ ఫీట్ చేసేసి.. దానిని కూడా సింపుల్ గా నెట్లో వదిలేసి.. వెంటనే హైప్ క్రియేట్ చేసేశాడు ఒక బాలీవుడ్ హీరో. పదండి మ్యాటర్ ఏంటో చూద్దాం.

అక్టోబర్ 22న 'బాహుబలి' తొలి కామిక్ బుక్ ను రిలీజ్ చేయాలని దర్శకుడు రాజమౌళి.. అలాగే నిర్మాతలూ.. ప్లాన్ చేశారు. అయితే వీరు అనుకున్న టైముకే ఇతర సినిమాల వారు కూడా కామిక్ బుక్స్ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారట. అలా ప్లాన్ చేసినవారిలో హీరో అజయ్ దేవగన్ కాస్త దూకుడు చూపించాడు. తన స్వీయదర్శకత్వంలో రూపొందిన ''శివాయ'' సినిమాను ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్న అజయ్.. ఇప్పుడు ఆ సినిమా తాలూకు కామిక్ బుక్స్ ను కూడా ప్రింట్ చేయించేశాడు. హార్డ్ కాపీస్ వచ్చాయో లేదో తెలియదు కాని.. అప్పుడే ఇంటర్నెట్లో ఆ కాపీలను వదిలేస సంచలనం సృష్టిస్తున్నారు. ప్లానింగ్ లో బాహుబలిని బీట్ చేసి ఒక రకంగా అజయ్ షాకిచ్చాడనే చెప్పాలి.

సర్లేండి.. ఒక సినిమాను కామిక్ బుక్ గా ప్రచురించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదులే. ఇప్పటికి చాలాసార్లు చాలా సినిమాల వారు అలా ప్రింట్ చేశారు. కాకపోతే వాటికి సేల్స్ వాల్యూ తక్కువ.. అలాగే ఆ క్యారెక్టర్లలో ఇంట్రెస్ట్ కూడా లేకపోయింది. మరి శివాయ కామిక్ బుక్స్ ఆ రేంజులో క్లిక్ అవుతాయో లేదో తెలియదు కాని.. బాహుబలి కామిక్స్ పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/