Begin typing your search above and press return to search.

ప్రభాస్ మూవీలో నటించడంలేదని క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   25 Oct 2020 9:00 AM IST
ప్రభాస్ మూవీలో నటించడంలేదని క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వంలో ''ఆదిపురుష్‌'' అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ 'లంకేష్'గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అజయ్‌ దేవగణ్‌ శివుడిగా కనిపించనున్నారని.. ఇప్పటికే మేకర్స్ ఆయన్ని సంప్రదించగా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, 'ఆదిపురుష్' లో అజయ్ దేవగణ్ నటించనున్నాడనే వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ఇది అవాస్తమని.. 'ఆదిపురుష్‌'లో పాత్ర గురించి ఇప్పటివరకూ ఎవరూ అజయ్‌ ని సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అజయ్‌ దేవగణ్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో ప్రభాస్ సినిమాలో అజయ్ దేవగన్ నటించడంలేదని క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ఈ సినిమాలో సీత పాత్ర ఎవరు పోషిస్తారనే విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. అనుష్క శెట్టి - అనుష్క శర్మ - కీర్తి సురేష్ - కియారా అద్వానీ - కృతిసనన్‌ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. 'ఆదిపురుష్' ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేయనున్నారు. ఏక కాలంలో తెలుగు హిందీ భాషల్లో 3డీలో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి కూడా అనువాదం చేసి విడుదల చేయనున్నారు.