Begin typing your search above and press return to search.

'భార‌తీయుడు 2' లో యాక్ష‌న్ గ‌న్‌

By:  Tupaki Desk   |   7 Aug 2018 5:26 PM GMT
భార‌తీయుడు 2 లో యాక్ష‌న్ గ‌న్‌
X
బాహుబ‌లి సిరీస్ సాధించిన విజ‌యం ఎన్నో పాఠాలు నేర్పించింది. ఆ త‌ర్వాత ద‌క్షిణాదిన ఏ భారీ బ‌డ్జెట్‌ సినిమా తీసినా అది బ‌హుభాషా చిత్రం కావాల‌ని మేక‌ర్స్ త‌పిస్తున్నారు. అన్నిచోట్లా విస్తారంగా ఉన్న మార్కెట్‌ ని ఛేజిక్కుంచుకుని భారీగా లాభాలార్జించాల‌న్న‌ది ప్లాన్. స‌రిగ్గా ఇదే పాయింట్ బ‌హుభాష‌ల్లో ప‌రిచ‌యం ఉన్న న‌టీన‌టుల‌కు బాగా క‌లిసొస్తోంది. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో నటించిన స్టార్ల‌కు ఆయాచిత వ‌రంగానూ మారుతోంది. ఒక భాష‌లో న‌టించిన స్టార్‌ కి ఇంకో భాష‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తోంది. కొత్త ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యే ఛాన్స్‌ ద‌క్కుతోంది. ఈ ఉధృతి ప్ర‌స్తుతం ఎన్నెన్నో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తోంది.

మునుముందు ఇండియా వ్యాప్తంగా ఉత్త‌రాది సినిమా - ద‌క్షిణాది సినిమా అన్న వైరుధ్య‌మే లేకుండా హ‌ద్దులు చెరిగిపోయే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఓవైపు ద‌క్షిణాది ఆడియెన్ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాల్ని ఇష్ట‌ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే అటు ఉత్త‌రాది - ఇటు ద‌క్షిణాది న‌టుల్ని క‌లుపుకుని సినిమాలు తీసేందుకు అగ్ర‌ద‌ర్శ‌కులు - భారీ నిర్మాణ సంస్థ‌లు భారీ బ‌డ్జెట్ ల‌తో స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఆ కోవ‌లోనే శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న 2.ఓ - మెగాస్టార్ సైరా- న‌ర‌సింహారెడ్డి తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

త‌దుప‌రి క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్న `భార‌తీయుడు- 2`కి ఇదే పంథాని అనుస‌రించ‌నున్నారు. ఈ సినిమా కోసం ప‌లువురు ఉత్త‌రాది - ద‌క్షిణాది న‌టుల్ని క్రేజీగా బ‌రిలో దించే స‌న్నాహ‌కాల్లో ఉన్నారు శంక‌ర్‌. ఇందులో భాగంగానే బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవ‌గ‌ణ్‌ తో ఇప్ప‌టికే మంత‌నాలు సాగించారు. చాలా కాలంగా దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్నా, మ‌రోసారి శంక‌ర్ త‌న‌ని క‌లిసి క‌న్ఫామ్ చేశార‌ని తెలుస్తోంది. అయితే యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తారు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. `భార‌తీయుడు 2`లో టాలీవుడ్ స‌హా ఇత‌ర‌త్రా భాష‌ల న‌టులకు ఛాన్సుంటుంద‌న్న ఊహాగానాలు ఉన్నాయి.