Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఇల్లీ బ్యాక్ లెస్ బాద్షాహో

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:40 AM GMT
ట్రైలర్ టాక్: ఇల్లీ బ్యాక్ లెస్ బాద్షాహో
X
అజయ్ దేవగన్ ప్రధానపాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ బాద్షాహో. మిలన్ లూథ్రియా దర్శకుడు కావడంతో.. ఈ చిత్రంపై ముందునుంచి మంచి అంచనాలే ఉండగా.. ఇప్పుడీ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ద్వారా స్టోరీ అంతా చెప్పేసిన దర్శకుడు.. తన మేకింగ్ స్టైల్ తో విపరీతంగా ఆకట్టుకున్నాడు.

1975లో ఎమర్జెన్సీ నాటి రోజుల్లో నడిచే కథ అంటూ బాద్షాహో ట్రైలర్ ప్రారంభించగా.. ఇందిరా గాంధీ సహా అప్పటి విజువల్స్ ను చూపించారు. ఆర్మీ రక్షణలో ఉండే ఓ పెద్ద ఖజానాను కొట్టేసేందుకు ఆరుగురు కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నదే ఈ సినిమా. ఇందుకోసం ప్రయత్నించే ఆరుగురు బ్యాడ్ పీపుల్ గా.. అజయ్ దేవగన్.. ఇలియానా డిసౌజా.. ఇమ్రాన్ హష్మీ.. ఈషా గుప్తా.. సంజయ్ మిశ్రా.. విద్యుత్ జమాల్ లు నటించారు. 96 గంటల్లో 600 కిలో మీటర్లు ప్రయాణించే ఓ ట్రక్ లో నిధి నిక్షేపాలు ఉంటాయి. వాటిని కొట్టేసేందుకు ఈ ఆరుగురు కలిసి చేసిన ప్రయత్నాలు.. యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటాయి.

మధ్యలో రొమాన్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు దర్శకుడు. టాలీవుడ్ బ్యూటీ ఇలియానా డిసౌజాను.. ఓ సన్నివేశంలో బ్యాక్ లెస్ గా చూపించడం కూడా విశేషం. వెనకనుంచి చూసినప్పుడు ఫేస్ చూపించకపోయినా.. అమ్మడి బక్కపలచని శరీరం.. తర్వాత ఒక ఫ్రేమ్ లో లిప్ కిస్ చేసేందుకు దగ్గరగా రావడం చూస్తే.. ఇల్లీనే ఇంతకు తెగించేసిందనే సంగతి అర్ధమవుతుంది. మొత్తం మీద బ్యాడ్ అంటూ.. బాద్షాహో ట్రైలర్ తో బాగానే మెప్పించాడు దర్శకుడు మిలన్ లూథ్రియా. సెప్టెంబర్ 1న బాద్షాహోను థియేటర్లలోకి తీసుకురానున్నారు నిర్మాతలు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/