Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో స్టార్ హీరో చిలిపి పని!

By:  Tupaki Desk   |   25 Sept 2018 3:37 PM IST
ట్విట్టర్ లో స్టార్ హీరో చిలిపి పని!
X
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. "కాజోల్ ఇండియాలో లేదు.. ఆమెను కాంటాక్ట్ చెయ్యడానికి ఈ నెంబర్ 98**1233** కు వాట్సాప్ చెయ్యండి". ఇక చూడండి భూగోళం బద్దలయింది. అజయ్ దేవగణ్ వైఫ్ కాజోల్ అప్పట్లో ఒక టాప్ హీరోయిన్. ఇప్పటికీ ఆమెకు చాలామంది అభిమానులున్నారు. ఇక ఆ నెంబర్ కు ఫోన్ల మీమద ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ నెంబర్ ట్రూకాలర్ లో కాజోల్ దేవగణ్ పేరుపై ఉంది. ఫోన్ రింగయినా ఎవరూ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు.

కొన్ని గంటల తర్వాత అజయ్ మళ్ళీ ఇలా ట్వీట్ చేశాడు. "సెట్స్ పై చిలిపి పనులు చేసేది పాత కాలంలో.. ఇప్పుడు మీపైన ట్రై చేశాను గైస్" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. "వార్నింగ్: ఈ స్టంట్ నిపుణులైన వారిచే చేయబడింది. ఇంటిదగ్గర ట్రై చెయ్యొద్దు" అని మరో వెటకారం ట్వీట్ పెట్టాడు. దీనర్థం నెటిజనులను అజయ్ ఆటపట్టించాడన్నమాట. ఇక చూసుకోండి.. ఫోన్ ట్రై చేసి చేసి విసుగెత్తిన జనాలు అజయ్ పై ఇంతెత్తున ఎగిరి పడ్డారు.

ఎంతమంది ఎంత హంగామా చేసినా అజయ్ దేవగణ్ నిన్నటి నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యాడు. కొంతమంది నెటిజనులు మాత్రం కాజోల్ కొత్త సినిమా 'హెలికాప్టర్ ఈలా' అక్టోబర్ 12 న రిలీజ్ కానుంది. దానికోసం ఇలా ప్రమోషన్ ట్రిక్ ప్లే చేశాడని అంటున్నారు.

సాధారణంగా అజయ్ అంటే సీరియస్ పాత్రలు స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారక్టర్స్ గుర్తొస్తాయి. 'గోల్మాల్' లాంటి కామెడీ ఎంటర్టైనర్ సీరీస్ లో నటించినా ఆడియన్స్ మాత్రం స్క్రీన్ పైన యాక్షన్ హీరో అజయ్ గుర్తొస్తాడు కానీ నిజ జీవితంలో అజయ్ చేసినంత అల్లరి ఇంకెవరూ చెయ్యరు. షూటింగ్ లోకేషన్స్ లో అజయ్ తన సహనటుల్ని ఏదో విధంగా ఆటపట్టిస్తూ ఉండరు. ఈ వైఫ్ ఫోన్ నంబర్ ప్రాంక్ అలాంటి వాటిలో ఒకటి.. అంతే!