Begin typing your search above and press return to search.

అజయ్ దేవగణ్ కొత్త బంగ్లా అన్ని కోట్లా?

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:00 AM IST
అజయ్ దేవగణ్ కొత్త బంగ్లా అన్ని కోట్లా?
X
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రస్తుతం పెద్దగా సినిమాలతో సందడి చేయడం లేదు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీలోనూ బోనీకపూర్ నిర్మాణలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయన సినిమాలకు మునుపటి క్రేజ్ లేకున్నా సంపాదనలో మాత్రం అజయ్ దేవ్ గణ్ సాటిలేదని నిరూపించుకున్నాడు.

తాజాగా ఈ స్టార్ హీరో ఓ ఖరీదైన కళ్లు చెదిరే ఇళ్లు కొన్నాడట.. ముంబైలోని జుహూలో ఓ విలాసవంతమైన ఇంటిని అతడు తన సొంతం చేసుకున్నట్లు బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిప్రస్తుతం అతడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉందట..

590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా కోసం అజయ్ దేవగణ్ ఏకంగా రూ.60 కోట్లు వెచ్చించాడట.. ఇదే ప్రాంతంలో బాలీవుడ్ స్టార్ ప్రముఖులు హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రసాద్, అక్షయ్ కుమార్ కూడా నివాసముంటున్న విషయం తెలిసిందే.

గత ఏడాది నుంచే కొత్త ఇంటి కోసం అజయ్ దేవగణ్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలోనే కపోలే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీతో డిసెంబర్ లో మంచి డీల్ కుదర్చుకున్నాడట.. మే 7న ఈ బంగ్లా రిజిస్ట్రేషన్ అజయ్ పేరు మీద రిజిస్ట్రర్ అయ్యిందట.. ఇంత వెచ్చించి కొన్న ఆ బంగ్లాలో ఏమేం ఉంటుందో నన్న ఆసక్తి బాలీవుడ్ లో నెలకొంది.