Begin typing your search above and press return to search.

#RRR : చివరి షెడ్యూల్‌ లో అజయ్‌ దేవగన్‌

By:  Tupaki Desk   |   30 Nov 2020 11:50 AM GMT
#RRR : చివరి షెడ్యూల్‌ లో అజయ్‌ దేవగన్‌
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే రెండుమూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేందుకు జక్కన్న చాలా సీరియస్‌ గా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కోసం విదేశీ ముద్దుగుమ్మలు వచ్చి ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌ కు అజయ్‌ దేవగన్‌ కూడా వచ్చాడు. ఈయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈయన పై మూడు వారా పాటు చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది.

కీలక నటీనటులు మరియు స్టార్స్‌ నటించబోతున్న ఈ షెడ్యూల్ పూర్తి అయితే సినిమాకు సంబంధించి ఈయన షూటింగ్‌ పార్ట్‌ పూర్తి అయినట్లే అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అజయ్‌ దేవగన్‌ తో షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత హీరోల ఇద్దరిపై దర్శకుడు రాజమౌళి షూటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఆలియా భట్‌ మరియు అజయ్‌ దేవగన్‌ లు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వారికి సంబంధించిన చిత్రీకరణ మొదట పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో జక్కన్న ఉన్నారని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే అజయ్‌ దేవగన్‌ చివరి షెడ్యూల్‌ తాజాగా మొదలయ్యింది. సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.