Begin typing your search above and press return to search.

'మహా సముద్రం'లో వారిద్దరిని హ్యాండిల్ చేయగలరా...?

By:  Tupaki Desk   |   24 May 2020 3:30 AM GMT
మహా సముద్రంలో వారిద్దరిని హ్యాండిల్ చేయగలరా...?
X
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విలక్షణమైన పాత్రలను విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'ఎక్సప్రెస్ రాజా' 'శతమానం భవతి' 'మహానుభావుడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం 'శ్రీకారం' సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా శర్వా 'మహాసముద్రం' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. 'Rx 100' లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ‘మహా సముద్రం’ తెరకెక్కించనున్నాడు.

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక హీరో శర్వానంద్ కాగా మరో హీరో ఎవరు అనే సస్పెన్స్ చాలా రోజులు కొనసాగింది. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో మరో హీరోగా 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ నటించబోతున్నాడట. ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో అయిన సిద్దార్థ్ ఇప్పుడు కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. అయితే తెలుగులో తన రీఎంట్రికి ఇదే మంచి సినిమా అని భావిస్తున్నాడట. అంటే శర్వానంద్ అండ్ సిద్దార్థ్ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై 'మహా సముద్రం'లో కనిపించబోతున్నారన్నమాట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పై నిర్మించనున్నారు. కాగా అజయ్ భూపతి ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసి పెట్టుకున్నాడట. ఐతే సిద్దార్థ్ రోల్ ని అజయ్ భూపతి ఎలా డీల్ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

శర్వానంద్ కెరీర్ స్టార్టింగ్ లో చాలా మల్టీస్టారర్ సినిమాలలో నటించాడు. కానీ ఇప్పుడు తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మరో హీరోతో కలిసి నటించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే ఇప్పుడు వేరే హీరో తో సింక్ అవ్వడానికి అంతగా ఒప్పుకోవడం లేదని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతి వీరిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఇంట్రెస్ట్ గా మారింది. మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడాలి. కాగా ఈ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటుండగా మరో హీరోయిన్ ని కోసం వేట మొదలుపెట్టారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొనివున్న పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.