Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్100 బైకు పెళ్లాడిందిలా!

By:  Tupaki Desk   |   26 Aug 2018 4:35 AM GMT
ఆర్ ఎక్స్100 బైకు పెళ్లాడిందిలా!
X
ఆర్ ఎక్స్ 100 బైకు పెళ్లాడింది. త‌నకు ఈడూ జోడూ అన‌ద‌గ్గ పిల్ల దొరికింది. ర‌య్ ర‌య్ మ‌ని ఇక రంకెలేస్తే క‌ష్ట‌మే ఇక‌!! ఆ హార్స్‌ ప‌వ‌ర్ ఎంతో చూపించే టైమ్ వ‌చ్చింది కాబ‌ట్టి.. రాజా వారి స్పీడుకి బ్రేకులే ఉండ‌వేమో!? సారీ.. రాజాధిరాజ రాజ‌మార్తాండ భూప‌తిరాజా పెళ్ల‌య్యింద‌న్న‌ది మా ఉద్ధేశం.

ఆర్‌.ఎక్స్ 100 సినిమా సంచ‌ల‌నాల గురించి జ‌నం చెప్పుకుంటున్న వేళ ఆ సినిమా ద‌ర్శ‌కుడు లైఫ్‌ లో సెటిలైపోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. సినిమా తీసి హిట్టు కొట్టాకే పెళ్లి అని భీష్మించుకున్నాడో.. లేక హిట్టు కొట్టి స‌త్తా చాటితేనే పిల్ల‌నిస్తాన‌ని మామ‌గారు స‌వాల్ విసిరారో ఏమో! మొత్తానికి ఆర్ఎక్స్ బైకులాంటి కుర్రాడికి పిల్ల‌దొరికింది. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్‌ లోని ఓ ప్ర‌యివేటు క‌ళ్యాణ‌మండ‌పంలో ల‌క్ష్మీ శిరీష మెడ‌లో మూడు ముడులు వేశాడు.

తొలి ప్ర‌య‌త్న‌మే హిట్టు కొట్టి, ఆ వెంట‌నే లైఫ్‌ లోకి ల‌క్ష్మీ దేవిని ఆహ్వానించిన యువ‌ద‌ర్శ‌కుడి కెరీర్ మ‌రింత ధేధీప్య‌మానంగా వెల‌గాల‌ని ఆకాంక్షిద్దాం. ఆర్‌.ఎక్స్ నిర్మాత‌ల‌తోనే భూప‌తికి వేరొక సినిమా క్యూలో ఉంది. మరిన్ని క్రేజీ ఆఫ‌ర్లు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌ కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. కొత్త పెళ్లికొడుక్కి శుభాకాంక్ష‌లు.