Begin typing your search above and press return to search.

నితిన్ తో కుదిరిందా భూపతీ?

By:  Tupaki Desk   |   18 July 2018 7:30 AM GMT
నితిన్ తో కుదిరిందా భూపతీ?
X
రా అండ్ బోల్డ్ లవ్ స్టోరీగా కేవలం యూత్ ఇచ్చిన కలెక్షన్లతోనే బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకున్న ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డిమాండ్ మామూలుగా లేదు. అగ్ర నిర్మాతలు మొదలుకుని గతంలో ఇతని కథలను వినమని చెప్పినవాళ్లు ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ అడుగుతున్నారట. సక్సెస్ వచ్చినప్పుడు ఇదంతా పరిశ్రమలో మామూలే కాబట్టి అజయ్ భూపతి కూడా తన రెండో సినిమా విషయంలో ద్వితీయ విఘ్నం రాకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అజయ్ భూపతిని నితిన్ లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బయట ఆఫ్ ది రికార్డు ఈ మాట కొందరితో అన్నట్టు ప్రచారమవుతోంది. కానీ ఆయన పేరు రివీల్ చేయకుండా సర్ ప్రైజ్ డైరెక్టర్ అని చెప్పడం చూస్తే అది ఇతనే అని ఫిలిం నగర్ టాక్. కానీ ఆరెక్స్ 100 ప్రమోషన్ లో బిజీగా ఉన్న అజయ్ భూపతి దీని గురించి చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. ఆరెక్స్ 100 విడుదలైన మూడో రోజే అజయ్ భూపతికి ఆఫర్ల వెల్లువ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ సురేష్ సంస్థ కోసం సురేష్ బాబు గోపిచంద్ కోసం మరో నిర్మాత ఇలా చాలా కాల్స్ వచ్చాయని ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంది. కాకపోతే నితిన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథ తన దగ్గర ఉండటంతో పాటు ఇచ్చిన ఆఫర్ మంచి డీల్ కావడంతో నితిన్ వైపే మొగ్గు చూపినట్టుగా వినికిడి.

శ్రీనివాస కళ్యాణంలో బిజీగా ఉన్న నితిన్ అది పూర్తయ్యేదాకా మీడియాకు కూడా కనిపించేలా లేడు. అప్పటిదాకా ఈ విషయాన్నీ నిర్ధారణగా చెప్పలేం. ఒక్క సక్సెస్ దర్శకుడి జాతకాన్ని మార్చడం అంటే ఇదేనేమో. స్టార్ హీరో అయ్యుంటే అందులో సగం క్రెడిట్ అతనికి వెళ్లి ఉండేది కానీ కొత్త హీరోతో చేసిన ప్రయోగంతో ఇంత సక్సెస్ అందుకున్నందుకు అజయ్ భూపతి పేరు మామూలుగా మారుమ్రోగడం లేదు.