Begin typing your search above and press return to search.

అక్కినేని బ్రదర్స్ మల్టీ స్టారర్ దర్శకుడు అతనేనా?

By:  Tupaki Desk   |   18 Sept 2019 10:39 AM IST
అక్కినేని బ్రదర్స్ మల్టీ స్టారర్ దర్శకుడు అతనేనా?
X
కింగ్ నాగార్జున వారసులుగా అక్కినేని భవిష్యత్తు స్టార్స్ గా అభిమానులు చూసుకుంటున్న నాగ చైతన్య అఖిల్ ల మల్టీ స్టారర్ కు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అధికారికంగా అలాంటి సూచనలు బయటికి కనిపించనప్పటికి అంతర్గతంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆరెక్స్ 100తో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కె అవకాశాలు ఉన్నట్టుగా వినికిడి.

మహా సముద్రం పేరుతో అజయ్ భూపతి గత కొన్ని నెలలుగా దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మొదలుకుని రవితేజ దాకా దీనికి సంబంధించి చాలా పేర్లు బయటికి వచ్చాయి. కాని ఎవరిది ఫైనల్ కాలేదు. ఇలా కొంత కాలయాపన జరిగిన తర్వాత ఫైనల్ గా భవ్య బ్యానర్ పై ఎట్టకేలకు సినిమా ఫిక్స్ అయ్యింది.

మల్టీ స్టారర్ కాబట్టి హీరోల పేర్లతో సహా టీం వివరాలు ఇంకా ఏవి ప్రకటించలేదు. ఇప్పుడీ వార్త నిజమైతే చైతు అఖిల్ లే హీరోలుగా ఉంటారు. అప్పుడు అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది. ఇది నిర్ధారణ కావాలంటే అజయ్ భూపతి నుంచి కాని నిర్మాత వైపు నుంచి కాని అధికారిక ప్రకటన రావాలి. దీనికి కొంత టైం పట్టేలా ఉంది. ఒకవేళ ఫిక్స్ అయితే హీరొయిన్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే ప్రాజెక్ట్ కోసం సమంతాను అడిగినట్టు అప్పట్లో టాక్ రావడం గమనించాల్సిన అంశం.