Begin typing your search above and press return to search.

ఆరెక్స్ 100 దర్శకుడి స్వీట్ వార్నింగ్

By:  Tupaki Desk   |   1 May 2019 11:01 AM IST
ఆరెక్స్ 100 దర్శకుడి స్వీట్ వార్నింగ్
X
మొదటి సినిమానే బ్లాక్ బస్టర్. తక్కువ బడ్జెట్ లో కొత్త హీరో హీరొయిన్లతో సాహసం అనిపించే స్టొరీ లైన్ తో మెప్పించి డబుల్ ట్రిపుల్ లాభాలను నిర్మాతకు వచ్చేలా చేయడం అంటే మాటలా. అందుకే ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ప్రత్యేకంగా కనిపించాడు. కాని అటు ఇటుగా మొదటి సినిమా వచ్చి ఏడాది దాటినా ఇప్పటిదాకా సెకండ్ మూవీ స్టార్ట్ అవ్వలేదు.

ఈ లోగానే ఆ ప్రాజెక్ట్ గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రామ్ లతో మొదలైన ఈ ప్రహసనం ఇప్పుడు నాగ చైతన్య దాకా వచ్చింది. మహా సముద్రం పేరుతో ఇది రూపొందనుందని సమంతా హీరొయిన్ గా చేసే అవకాశం ఉన్నట్టు ఇలా చాలా ప్రచారమే జరిగింది. ఇక రేపో ఎల్లుండో షూటింగ్ స్టార్ట్ అనే స్థాయిలో ఇవి చాలా దూరం వెళ్లడంతో ఎట్టకేలకు అజయ్ భూపతి ట్విట్టర్ లో స్పందించాడు.

తన రెండో సినిమా ఎవరితో ఎప్పుడు ఎక్కడ తీయాలో తెలుసని దయచేసి పుకార్లకు చెక్ పెట్టమని కోరాడు. సో పైన చెప్పిన హీరోల్లో ఎవరితోనూ లేదని ఇన్ డైరెక్ట్ గా అనుకోవచ్చు. లేదూ ఉంది అనుకున్నా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కి టైం ఉంది కాబట్టి ఈ గాసిప్స్ ప్రహసనానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఇలా మెసేజ్ పెట్టి ఉండవచ్చు.

ఏది ఏమైనా సక్సెస్ వచ్చిన వాళ్ళ వెనుక పరుగు పెట్టె పరిశ్రమలో ఇలా జరగడం అనూహ్యమే. అయినా రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ అంతటి దర్శకుడే క్లారిటీ మిస్ అయ్యి ఏడాది వృధా చేసుకోవాల్సి వచ్చింది. అజయ్ భూపతి చేసింది ఒకటే కాబట్టి ఇదేమి అసహజం కాదు