Begin typing your search above and press return to search.

ఆరెక్స్ దర్శకుడు అ ఆ హీరోతోనే!

By:  Tupaki Desk   |   28 Sep 2018 7:31 AM GMT
ఆరెక్స్ దర్శకుడు అ ఆ హీరోతోనే!
X
RX100' సంచలన విజయంతో ప్రేక్షకులను.. ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి సెకండ్ సినిమా దాదాపుగా ఫైనలైజ్ అయినట్టే. అజయ్ నెక్స్ట్ సినిమా ఒక మల్టిస్టారర్ అని అందులో రామ్ - దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం మేరకు ఆ మల్టిస్టారర్ ప్లాన్ ను పక్కన బెట్టి నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అజయ్.

'RX100' హిట్ కాగానే అజయ్ కు మొదటగా అడ్వాన్సు ఇచ్చింది నితినేనని సమాచారం. కానీ ఎందుకో అజయ్ మల్టిస్టారర్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సైడ్ లైన్ కావడం తో మళ్ళీ నితిన్ సినిమాను ఫైనలైజ్ చేసుకున్నాడట. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తారు. ఇప్పటికే స్టొరీలైన్ లాక్ చేసి స్క్రిప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడట. త్వరలో ఈ సినిమా ను అధికారికంగా ప్రకటిస్తారని.. హీరోయిన్.. టెక్నీషియన్స్ వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

అజయ్ భూపతి కి 'RX100' తమిళ రీమేక్ ను దర్శకత్వం వహించమని కోరినా ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్ వినిపించింది. దీంతో తన రెండో సినిమాకు కూడా ఓ ఒరిజినల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాడని అనుకోవచ్చు. ఏదేమైనా హిట్ కోసం పరితపిస్తున్న నితిన్ కు అజయ్ ఒక మంచి హిట్ అందించాలని కోరుకుందాం.