Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 152కి సూపర్ జోడి?

By:  Tupaki Desk   |   22 Sept 2019 12:41 PM IST
మెగాస్టార్ 152కి సూపర్ జోడి?
X
తెలుగులో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఎంతగా అంటే సాహో సైరా లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అక్షరం ముక్క తెలుగు రాని బాలీవుడ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల ను దిగుమతి చేసుకునేంత. ఇక్కడున్న ఒకరిద్దరు మూసలో పడిపోయి ఒకేరకమైన ట్యూన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారన్న విమర్శల వల్ల ఇలా ఆధారపడక తప్పడం లేదు. సైరా పాటల కోసం అమిత్ త్రివేది బీజీఎమ్ కోసం జూలియస్ పకియంను తీసుకున్న చిరు టీమ్ నెక్స్ట్ మూవీ 152 కోసం కూడా ఇదే తరహా ప్లాన్ లో ఉందట.

పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుని షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి సంబంధించి టీమ్ ని డిసైడ్ చేసే యూనిట్ చాలా బిజీగా ఉంది విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి కూడా బాలీవుడ్ ద్వయం అజయ్ - అతుల్ ని తీసుకోబోతున్నట్టు వినికిడి. మరాఠి బ్లాక్ బస్టర్ సైరాత్ తో వీళ్ళ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ధఢక్ కు కూడా వీళ్ళే మ్యూజిక్ ఇచ్చారు.

ఇటీవలే వచ్చిన హిట్ మూవీ సూపర్ 30 వీళ్ళ ఖాతాలోనిదే. ఇప్పుడు చిరు 152కి వీళ్లయితేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం కావడంతో దాదాపు ఓకే అయినట్టు తెలిసింది. అధికారిక ప్రకటన షూటింగ్ రోజే వెలువడవచ్చు. ఇది పక్కా కమర్షియల్ మూవీ కాబట్టి చిరు మార్కు ఫైట్లు డాన్సులు ఆశించవచ్చు. సో అజయ్ అతుల్ కనక అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారంటే ఇక్కడ మన స్టార్లు క్యూ కట్టేస్తారు