Begin typing your search above and press return to search.

ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలిందే!

By:  Tupaki Desk   |   17 July 2019 7:50 AM GMT
ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలిందే!
X
తెలుగు ప్రేక్షకులకు ఐశ్వర్య రాజేష్ పేరు పెద్దగా పరిచయం లేదు కానీ తమిళంలో చాలా పాపులర్ హీరోయిన్. ఇప్పటివరకూ దాదాపు ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగులోకి త్వరలో 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈసినిమానే కాదు.. విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ భామ బుట్టలో మరో క్రేజీ ఆఫర్ వచ్చిపడింది.

శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న 'ఇండియన్ 2' లో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయినా బడ్జెట్ ఇష్యూస్ తో అగిందనే టాక్ వినిపించింది. అయితే నిర్మాతలు విధించిన బడ్జెట్ లో పరిమితుల్లోనే సినిమాను పూర్తి చేసేందుకు శంకర్ అంగీకరించడంతో ఈ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట. ఆగష్టు నుండి బ్రేక్స్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారని టాక్. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అంటే ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలినట్టే.

ఇదిలా ఉంటే ఐశ్వర్య చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. నాలుగు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో నాలుగు చిత్రాలను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా తెలుగులో 'మిస్ మ్యాచ్'.. తో పాటు 'కౌసల్య కృష్ణ మూర్తి'.. విజయ్ దేవరకొండ చిత్రాలు కూడా ఉన్నాయి.