Begin typing your search above and press return to search.

లుక్ లాంచ్‌: `రిప‌బ్లిక్`లో ఎన్నారైగా తెలుగ‌మ్మాయి

By:  Tupaki Desk   |   27 Aug 2021 7:53 AM GMT
లుక్ లాంచ్‌: `రిప‌బ్లిక్`లో ఎన్నారైగా తెలుగ‌మ్మాయి
X
మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా దేవ‌క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో `రిప‌బ్లిక్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్థానం త‌ర‌హా ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. స‌మాజాన్ని.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేలా సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌..క‌థ‌నాల‌తో దేవాక‌ట్టా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ కెరీర్ లో చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్రంగా నిలిస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది.

ఇందులో తెలుగమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్ .. డేరింగ్ గాళ్ మైరా హాన్స‌న్ అనే పాత్ర‌లో న‌టించింది. తాజాగా ఆ పాత్ర‌కు సం బంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని వెట‌ర‌న్ న‌టి ర‌మ్మ‌కృష్ణ ఆవిష్క‌రించారు. పోస్ట‌ర్ లో మైరా హాన్స‌న్ సీరియ‌స్ లుక్ లో కనిపిస్తున్నారు. అది పూర్తిగా స్కెచ్ వేసిన డిజైన్. అదే పోస్ట‌ర్ లో ఆమె పాత్ర ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో కూడా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. `ఉయ్ ఫాల్... ఉయ్ బ్రేక్.. ఉయ్ ఫెయిల్.. బ‌ట్ దెన్ ఉయ్ రెయిజ్ .. ఉయ్ హిల్.. ఉయ్ ఓవ‌ర్ క‌మ్!! అంటూ దేవా క‌ట్టా త‌న‌దైన శైలిలో డిజైన్ చేసిన పోస్ట‌ర్ ని వ‌దిలిన‌ట్లు తెలుస్తోంది.

`ప్ర‌స్థానం`.. `ఆటో న‌గ‌ర్ సూర్య` చిత్రాల త‌ర‌హాలోనే రిప‌బ్లిక్ లోనూ బ‌ల‌మైన సంభాష‌ణ‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. స్క్రిప్ట్ ని మించి దేవ‌క‌ట్టా అద్భుత‌మైన డైలాగులు రాస్తార‌ని ఇంత‌కుముందే ప్రూవైంది. రిప‌బ్లిక్ లోనూ అలాంటి ప‌దునైనా డైలాగుల‌కు కొద‌వుండ‌ద‌ని తెలుస్తోంది.

ప్ర‌జాస్వామ్యంలో మూడు స్థంభాలుగా నిలిచే శాస‌న‌.. కార్య‌నిర్వాహాక.. న్యాయ వ్య‌వ‌స్థ అంశాల్ని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్న‌ట్లు యూనిట్ వ‌ర్గాలు రివీల్ చేసాయి. ఇందులో జ‌గ‌ప‌తిబాబు..ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌థ‌ను న‌డిపించ‌డంలో ఈ పాత్ర‌లు ప్ర‌ధానమ‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ స‌హ‌కారంతో జెబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై జె భ‌గ‌వాన్.. జె పుల్లారావు నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియా RRRలో గిరిజ‌న యువ‌తిగా

ఐశ్వ‌ర్యా రాజేష్ కెరీర్ ఆరంభ‌మే వ‌రుస ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకుంది. ఇంత‌కుముందు శైల‌జా కృష్ణ‌మూర్తిలో క్రికెట‌ర్ కావాల‌ని క‌ల‌లు గ‌నే గ్రామీణ యువ‌తి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇక ఆర్.ఆర్.ఆర్ లోనూ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇందులో చ‌రణ్ స‌ర‌స‌న ఆలియా సీత‌గా న‌టిస్తుంటే.. కొమ‌రం భీమ్ గా న‌టిస్తున్న తారక్ స‌ర‌స‌న హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా న‌టిస్తోంది. ఐశ్వ‌ర్యా రాజేష్ పాత్రా ఇందులో మెరిపిస్తుంద‌ట‌. ఇందులో గోండు గిరిజ‌న యువ‌కుడిగా తార‌క్ న‌టిస్తున్నాడు. ఇక భీమ్ లాంటి వీరుడిని ఇష్ట‌ప‌డే మ‌ర‌ద‌లిగా.. గిరిజ‌న యువ‌తి ప‌రిచ‌యం ఉంటుంద‌ట‌.

ఆ పాత్ర‌కు ఎవ‌రు న్యాయం చేస్తారు? అన్న‌ది ఆరా తీస్తే దానికి తమిళంలో పాపుల‌రైన తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ ని జ‌క్క‌న్న ఎంపిక చేసుకున్నారు. త్వ‌ర‌లో రిలీజ్ కి రానున్న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలోనూ నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ‌తో క‌లిసి స్పేస్ పంచుకుంది. ఐశ్వ‌ర్య రాజేష్ ఇటీవ‌ల వ‌రుస‌గా తెలుగు-త‌మిళం ద్విభాషా చిత్రాల్లో న‌టిస్తోంది. పెర్ఫామ‌ర్ గా త‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. తాజా ఆఫ‌ర్ల‌తో న‌టిగా స‌త్తా చాటేందుకు ఆస్కారం దొరికింది. తాను ఏ పాత్ర‌ను ఎంచుకున్నా న‌టిగా ఫెయిల్ కాదు. అందుకే సినిమాల జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా ఐశ్వ‌ర్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.