Begin typing your search above and press return to search.
పవన్ హీరోయిన్ గా ఆమె ఫైనల్..?
By: Tupaki Desk | 4 Jan 2021 10:30 AM ISTఅటు పొలిటికల్ లీడర్ గా.. ఇటు పవర్ స్టార్ గా.. రాజకీయాలను, సినిమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కల్యాణ్. ‘వకీల్ సాబ్’ చిత్రంతో తన రీఎంట్రీని ప్రకటించిన పవన్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఏడాదికి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ పవర్ స్టార్.. ఇప్పుడు వీలైనన్ని సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ మొదలైంది. పవన్-రానా కాంబినేషన్లో ఈ బిగ్ మల్టీ స్టారర్ రూపొందుతుండగా.. ఈ చిత్రాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో మూవీ చేయనున్నాడు పవన్.
కాగా.. క్రిష్ దర్శకత్వం వహించనున్న మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటు తరహా పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటించనుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఐశ్వర్య ఒక గిరిజన యువతి పాత్రలో ఛాలెంజ్ రోల్‌ను పోషించనుందని సమాచారం. కాగా.. ‘అయ్యప్పన్ కొశియమ్’ రీమేక్‌లోనూ ఐశ్వర్య నటిస్తోందని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరి, ఇందులో ఏది నిజం అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా ఉంటే.. దర్శకుడు క్రిష్ ఇటీవల కరోనా బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే.. క్రిష్ ఈ న్యూస్ ను ఖండించలేదు. దీంతో.. కరోనా వార్తలు నిజమేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పవన్-క్రిష్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది చూడాలి.