Begin typing your search above and press return to search.

ఐసూతో మణి సర్‌ ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   26 May 2015 3:00 PM IST
ఐసూతో మణి సర్‌ ఏం చేస్తున్నారు?
X
నిన్నగాక మొన్ననే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ ఓపెన్‌గా ఓ ఆసక్తికర సంగతిని పబ్లిక్‌లో ఆవిష్కరించింది. ఓ ఇంటర్వ్యూలో ముచ్చటిస్తూ.. ఎంతో కాలంగా రీఎంట్రీ గురించి ఎదురు చూస్తున్నా. అది నా ఫేవరెట్‌ దర్శకుడు మణిరత్నం సర్‌తోనే అయితే బావుంటుందని భావిస్తున్నా. ఇప్పటికే చర్చలు సాగాయి. కానీ టెక్నికల్‌ అంశాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతోంది. రీసెంటుగానే మరోసారి తనతో ముచ్చటించాను. దీనిపై రివైజ్‌ చేస్తున్నానని చెప్పారు. త్వరలోనే సెట్స్‌కెళతామన్న నమ్మకం ఉంది.. అని చెప్పింది.

అయితే ఇదే విషయమై మణిరత్నమ్‌ సన్నిహిత వర్గాలు స్పందించాయి. మణి సర్‌ ఇప్పడే ఈ సినిమా గురించి మాట్లాడలేరు. సమయం పడుతుందింకా. కొత్త ప్రాజెక్టుపై ఆలోచించలేదింకా .. అని చెబుతున్నారు. ప్రస్తుతం మణి చెన్నయ్‌ హీట్‌ని తట్టుకోలేక బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడ సీతల పవనాల్లో కాసింత సేద దీరుతున్నారు. ఓకే బంగారం (ఓకే కన్మణి) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. విజయం సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది కాబట్టి ఐసూతో కొత్త ప్రాజెక్టు విషయమై అక్కడే ఆలోచిస్తారని ఆశిద్దాం. గతంలో ఇరువర్‌, గురు, రావన్‌ సినిమాల్లో కలసి పనిచేసిన ఈ దర్శక-హీరోయిన్లు మరోసారి కలిస్తే అది సినిమా లవర్స్‌కు పండగే.