Begin typing your search above and press return to search.

ఈ మాజీ తో సల్మాన్ బ్రేక‌ప్.. ఐసూనే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   8 Jan 2022 1:30 AM GMT
ఈ మాజీ తో సల్మాన్ బ్రేక‌ప్.. ఐసూనే కార‌ణ‌మా?
X
నటి సోమీ అలీ హిందీ ఆడియెన్ కి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో అల్లాడించిన ఈ బ్యూటీ US నుండి భారతదేశానికి వచ్చి 90 లలో కొన్ని హిందీ సినిమాలు చేసింది. సల్మాన్ ఖాన్ తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది ఈ అంద‌గ‌త్తె. కానీ సడన్ గా వ‌న్ ఫైన్ డే అతనితో గొడ‌వ‌ప‌డి బ్రేక‌ప్ చేసుకుంది. అస‌లింత‌కీ ఈ గొడ‌వ‌కు కార‌ణ‌మేమిటి? అన్న‌ది ఆరా తీస్తే షాకిచ్చే నిజ‌మే బ‌య‌ట‌ప‌డింది.

చాలా సంవత్సరాల తరువాత మోడ‌ల్ కం న‌టి సోమి ఒక ఇంటర్వ్యూలో ఆ సంగ‌తిపై ఓపెనైంది. సల్మాన్ తో విడిపోవడానికి కారణం ఐశ్వర్య రాయ్ అని ఈ బ్యూటీ నిష్క‌ర్ష‌గా చెప్పింది. అయితే ఆ సమయంలో ఇద్దరూ సరైన పని చేశామ‌ని భావించారట‌. సోమి అలీతో విడిపోయిన తర్వాత సల్మాన్ ఐశ్వర్యారాయ్ తో డేటింగ్ చేశాడు. ఆ త‌ర్వాత ఐష్ నుంచి కూడా అతడు విడిపోయాడు. ఆ త‌ర్వాత క‌త్రిన‌తో సుదీర్ఘ కాలం ల‌వ్వాయ‌ణం సాగించిన సంగ‌తి తెలిసిందే. త‌న మేక‌ప్ ఉమెన్ లులియా వాంటూర్ తోనూ భాయ్ ప్రేమాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్. జాక్విలిన్- డైసీ షా లాంటి గాళ్ ఫ్రెండ్స్ అత‌డికి ఉన్నారు.

కానీ ఐశ్వ‌ర్యారాయ్ మాత్రం స‌ల్మాన్ నుంచి విడిపోయాక వివేక్ ఒబేరాయ్ తో ప్రేమాయ‌ణం సాగించింది. హృతిక్ తో ధూమ్ ఫ్రాంఛైజీలో లిప్ లాక్ ల‌తో వేడెక్కించింది. అభిషేక్ బ‌చ్చ‌న్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఇంత‌కాలానికి తిరిగి లైమ్ లైట్ లోకి వ‌చ్చిన నటి సోమి అలీ బ్రేకప్ భరించలేక అప్ప‌ట్లో యుఎస్ వెళ్లిపోయాన‌ని చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది. స‌ల్మాన్ ప్ర‌స్తుతం టైగ‌ర్ 3 స‌హా వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.