Begin typing your search above and press return to search.

దగ్గరుండి నేనే ఉతికిస్తా -ఐష్‌

By:  Tupaki Desk   |   14 May 2016 9:00 PM IST
దగ్గరుండి నేనే ఉతికిస్తా -ఐష్‌
X
ఐశ్వర్య రాయ్‌. ప్రపంచ ప్రసిద్ద అందగత్తె. మిస్‌ ఇండియా మాత్రమే కాదు.. విశ్వసుందరి కూడా. 42 ఏళ్ళ వయస్సులోనూ ఇంకా తన మెరుపులతో కుర్రాళ్ళ మనస్సులను చెదరగొడుతూనే ఉంటుంది. అయితే ఈ భామ ఇంట్లో ఎలా ఉంటుంది? రాణి గారిలా ఉంటుందా? లేదంటే ఓ సాధారణ గృహిణిలా ఉంటుందా?

''బాబూ.. నేను కూడా ఇంట్లో ఒక సామన్య గృహిణినే. బట్టలు ఉతికించాలంటే.. మా చాకలికి ఎలా ఉతకాలి.. ఎంత డిటర్జెంట్‌ వేయాలి.. దానిలో ఏ బట్టలో ఐరన్‌ చేయాలని ఏవి చేయకూడదు అంటూ నేనే బోలెడంత చెబుతాను. పైగా ఏయే బట్టలు ఉతకడానికి ఇచ్చానో ఒక చిట్టాలపద్దు కూడా రాసుకుంటా. తిరిగి బట్టలు ఉతికి తెచ్చాక అవన్నీ లెక్క సరిచూసుకుంటా. ఒక్కోసారి దగ్గరుండి మరీ బట్టలు ఉతికిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది ఐష్‌. కమెడియన్‌ కపిల్‌ శర్మ తన కొత్త షో కోసం.. సారబ్జిత్‌ సినిమాను ప్రమోట్‌ చేసుకోమని ఐశ్వర్యను ఇన్వయిట్‌ చేశాడు. ఆ సందర్భంగా మనోడు అడిగిన ప్రశ్నలకు ఇలా జవాబిచ్చింది సుందరాంగి.

బయట స్టాటస్‌ ఎంత పెద్దది అయినా.. మన ఇల్లు అన్నప్పుడు మనం కొన్ని పనులు చేసుకోక తప్పదు. ఐశ్వర్య రాయ్‌ అయినా.. ఇంకెవరైనా కూడా అంతేగా మరి. అది సంగతి.