Begin typing your search above and press return to search.
ఐశ్వర్యకు మూడు కోట్లు ఎగ్గొట్టారు
By: Tupaki Desk | 29 Oct 2015 3:00 PM ISTదాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఐశ్వర్యారాయ్ ముఖ్య పాత్ర పోషించిన సినిమా ‘జజ్బా’. ఈ ఐదేళ్లలో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద సినిమాలకు అడిగారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో క్యామియో రోల్స్ ఆఫర్ చేశారు. కానీ అవేవీ వద్దని ‘జజ్బా’ సినిమా చేయడానికి ఒప్పుకుంది ఐశ్వర్య. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం చాలానే కష్టపడింది ఐష్. సినిమాలో ఆమె పెర్ఫామెన్స్ కూడా అదుర్స్ అన్నారు క్రిటిక్స్. ఐతే ఇంత చేసినా ఆమెకివ్వాల్సిన పారితోషకం మాత్రం ఇవ్వలేదట నిర్మాతలు. నాలుగు కోట్లకు పారితోషకం మాట్లాడుకుని కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారట.
ముందుగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఐశ్వర్యతో సినిమా మొదలు పెట్టిన నిర్మాతలు.. మిగతా మూడు కోట్లు ఇవ్వనేలేదట. నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాతల చేతిలో పైసా లేదు. సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ కూడా జరగలేదు. సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి కానీ.. జనాలు మాత్రం ఆదరించలేదు. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా ఇస్తామన్నారట కానీ.. సినిమాకు అంత సీన్ లేకపోయింది. పెట్టుబడే తిరిగిరాలేదు. దీంతో ఐశ్వర్యకు మూడు కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడిక శాటిలైట్ హక్కుల ద్వారా ఏమైనా వస్తే ఐశ్వర్య బాకీ తీరుద్దామని చూస్తున్నారట కానీ.. నిర్మాతల పరిస్థితి చూసే ఐశ్వర్య డబ్బులడిగే పరిస్థితి లేదట.