Begin typing your search above and press return to search.

ఇది ఐష్ కి వదిలేయడమే కరెక్ట్

By:  Tupaki Desk   |   18 Sept 2015 11:00 PM IST
ఇది ఐష్ కి వదిలేయడమే కరెక్ట్
X
ప్రస్తుతం తెలుగు నుంచి పెద్ద సంఖ్యలో సినిమా కథలు హిందీకి వెళ్తున్నా.. బాలీవుడ్ మూవీస్ కాస్త తక్కువగానే టాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. అయితే.. ఏదైనా మంచి సినిమాతో స్టోరీ రాగానే.. రీమేక్ ఎవరు చేస్తున్నారు ? ఎవరు నటిస్తే బాగుంటుంది ? రైట్స్ ఎవరు కొన్నారనే ఆరాలు పెరిగిపోతున్నాయి. కహానీ(తెలుగులో అనామిక), ఓ మై గాడ్(గోపాలా గోపాలా) ఇలా బోలెడు ఎంక్వైరీల తర్వాత దిగుమతి అయిన సినిమాలే. ఇలా వచ్చిన వాటిలో సక్సెస్ అయినవి కొన్నే అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఆరేళ్ల ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాలీవుడ్ లో రీఎంట్రీ కోసం ఎంచుకున్న ప్రాజెక్ట్ జాజ్ బా. లాయర్ గా ఐష్ నటిస్తున్న ఈ మూవీపై ముందునుంచే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజయ్యాక ఇవి రెట్టింపయిపోయాయి. కూతురుని మాఫియా కిడ్నాప్ చేయడంతో.. ఓ టెర్రరిస్ట్ కు అనుకూలంగా డిఫెన్స్ లాయర్ గా వాదించాల్సి వచ్చే కేరక్టర్ అది. ఇలాంటి కేరక్టర్ ని తెలుగులో చేయగల సత్తా ఉన్న హీరోయిన్ ఎవరున్నారు ?

అనుష్క, నయనతార.. ఈ రెండు పేర్లు తప్ప వేరేవాళ్లని ఊహించుకోవడం కష్టం. సౌత్ సినిమాల నుంచే నార్త్ కి వెళ్లింది ఐశ్వర్యారాయ్. దక్షిణాదిలో ఆమెకు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే కొన్నింటికి దెబ్బ పడడంతో.. ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని రీమేక్ చేసే అవకాశం ఇవ్వడం సరికాదని అనుకుంటున్నారు జాజ్ బా ప్రొడ్యూసర్స్. అందుకే ఒరిజినల్ ని డబ్ చేసి ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఐష్ సినిమాని తెలుగులోనే చూసే అవకాశం వస్తుందని అనుకోవచ్చు.