Begin typing your search above and press return to search.

వెరీ హాట్‌: ఐశ్వర్య కూడా ఏడుపే

By:  Tupaki Desk   |   14 Sept 2015 3:00 PM IST
వెరీ హాట్‌:  ఐశ్వర్య  కూడా ఏడుపే
X
అప్ప‌ట్లో న‌య‌న‌తార క‌న్నీళ్లు పెట్టుకుంది అంటే .. అయ్యో పాపం అనుకున్నారంతా. సెన్సిటివ్ మైండ్‌ సెట్ .. అందుకే ఏడ్చేసిందిలే అనుకున్నారు. ఓవైపు ప్ర‌భుదేవాని పెళ్లాడేస్తున్నా అనుకుని అలా ఏడ్చిందిలే అని జోకులు కూడా వేశారు కొంద‌రైతే. శ్రీ‌రామ‌రాజ్యం షూటింగ్ పూర్త‌య్యాక బాపు వంటి దిగ్ధ‌ర్శ‌కుడితో ప‌నిచేశాక ఆ ఏడుపు స‌హ‌జ‌మే అనుకున్నారంతా. కానీ ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ హీరోయిన్ ల ఏడుపు చూస్తుంటే ఏడ్వ‌లేక ఏడ్చేసే ప‌రిస్థితి వ‌చ్చేట్టుంది. అప్ప‌డు దీపిక‌ - క‌త్రిన‌ - ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ ఏడ్చి అంద‌రినీ ఏడిపిస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ నుంచి రొజుకొక హీరోయ‌న్ ఏడుపు వినిపిస్తోంది. ఆ మ‌ధ్య దీపికా ప‌దుకునే ర‌ణ‌బీర్ క‌పూర్ కోసం త‌మాషా సినిమా సెట్ లో చివ‌రి రోజున ఏడ్చి పెడ‌బొబ్బ‌లు పెట్టేసింది. ప్రియుడి పై అనుమానంతో వ‌చ్చిన క‌త్రిన‌ కైఫ్ సైతం అనుకోకుండా హాజ‌రై ఆ సంద‌ర్భంలో క‌న్నీటి ప‌ర్యంతం చెందింది. తాజాగా అభిషేక్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి ఐశ్వ‌ర్యారాయ్ కూడా జాజ్బా సినిమా సెట్ లో క‌న్నీరు మున్నీరైంది. అయినా ఆ బాధ‌కు సంతృప్తి చెంద‌లేదుట‌. ప‌క్కనే ఉన్న మేక‌ప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్ట‌ర్ గుండెల మీద ప‌డి మ‌రీ ల‌బోదిబో మంది.

దీంతో మిక్కీ కూడా త‌న ఫీలింగ్స్ ను క‌న్నీరు రూపంలో బైటికే చెప్పేశాడుట‌. అయితే ఈ క‌న్నీళ్లన్నిటికీ కార‌ణం మాత్రం ఒక్క‌టే. ఆ రోజు తో ఆ సినిమా యూనిట్ తో రుణం తీరిపోవ‌డ‌మే. నెల‌లు - సంవ‌త్స‌రాలు త‌ర‌బ‌డి ఒకే టీమ్ తో ప‌నిచేస్తే వాళ్ల తో మంచి స్నేహ బంధం ఏర్ప‌డిపోతుంది. షూటింగ్ చివ‌రి రోజున వాళ్ల‌తో బంధం వీగిపోతుందంటే మ‌న‌సు కుంగిపోతుంది. కంట్రోల్ చేసుకున్నా క‌న్నీళ్లు ఆగ‌వు. ఆలా జ‌రిగిన సంద‌ర్భాలే ఇవ‌న్నీ కూడా. అయితే క‌త్రినా క‌న్నీళ్ల‌ కు మాత్రం కార‌ణం ప్ర‌త్యేక‌మైన‌ది.