Begin typing your search above and press return to search.

ఐశ్వర్య కూతురు అదరగొట్టేసింది

By:  Tupaki Desk   |   20 Dec 2017 8:00 AM IST
ఐశ్వర్య కూతురు అదరగొట్టేసింది
X
ఎంతటి వారికైనా.. పిల్లల ప్రతిభ చూస్తే కలిగే ఆనందమే వేరు. ఇందుకు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్.. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా మినహాయింపేమీ కాదు. వీళ్ల ముద్దుల కూతురు ఆరాధ్య ముంబయిలోని తన పాఠశాలలో ఇచ్చిన డ్యాన్స్ పెర్ఫామెన్స్ చూసి తల్లిదండ్రులిద్దరూ ముగ్ధులైపోయారు. ఆరాధ్య ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటోంది. ఆ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించారు. అందులో భాగంగా ఐశ్వర్య తనయురాలు డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఒక గ్రూప్‌ ను లీడ్ చేస్తూ ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఆరాధ్య తల్లికి తగ్గ తనయురాలే అనిపించింది. చక్కటి నృత్యంతో ఆకట్టుకుంది. అది చూసి ఐశ్వర్య పొంగిపోయింది. ఆమె కూడా తర్వాత కూతురితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వేడుకకు అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. అతను కూడా చాలా ఆనందంతో కనిపించాడు. ఇంతకుముందు మంగళూరులో జరిగిన ఒక వేడుకలోనూ ఆరాధ్య ఇలాగే హైలైట్ అయింది. ఆరాధ్య తాతయ్య అమితాబ్ బచ్చన్ కూడా ఈ వేడుకకు రావాల్సింది కానీ.. ఆయన ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లారు. ఈ వేడుకలో అమీర్ ఖాన్ తనయుడు అజాద్ రావు ఖాన్ సైతం డ్యాన్స్ చేయడం విశేషం. అతడి పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.