Begin typing your search above and press return to search.

ఐష్ బర్త్ డే కేక్ చూశారా..

By:  Tupaki Desk   |   5 Nov 2017 10:23 AM GMT
ఐష్ బర్త్ డే కేక్ చూశారా..
X
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కు సంబంధించిన ఏ చిన్న విశేషమైనా పెద్ద వార్తే. 40వ పడిలో పడ్డా ఆమెకున్న క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ఆమెకు బాలీవుడ్లో మంచి డిమాండుంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. మళ్లీ రీఎంట్రీకి రెడీ అనగానే ఐష్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఆమె ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. కొన్ని నెలల కిందట కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సిండ్రెల్లా గౌనులో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ గౌను గురించి పెద్ద చర్చే నడిచింది అప్పట్లో. ఆ గౌనులో ఐశ్వర్యను చూసి వయసు పెరిగినా వన్నె తగ్గలేదంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది.

ఇప్పుడు ఈ గౌను గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం ఆ గౌనులో ఐశ్వర్య రూపాన్ని తలపిస్తూ ఓ సంస్థ కేక్ తయారు చేసింది. నవంబరు 1న ఐష్ పుట్టిన రోజు వేడుకల కోసం తయారు చేసిన కేక్ ఇది. ఆ సంస్థ రెండు రోజుల తర్వాత ఈ కేక్ తాలూకు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ కేక్ తయారు చేయడానికి ఆ సంస్థ సిబ్బంది చాలానే కష్టపడ్డారట. నవంబరు 1తో ఐశ్వర్యకు 44 ఏళ్లు నిండడం విశేషం. మొన్న ఆమె పుట్టిన రోజు వేడుకల్ని ముంబయిలో ఘనంగా ని్వహించారు. ఐతే వాటికి సంబంధించిన ఫొటోలేవీ బయటికి రాలేదు. కానీ కేక్ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.