Begin typing your search above and press return to search.
దాని గురించి అడిగితే ఐష్ కి మండింది
By: Tupaki Desk | 26 Aug 2015 11:18 PM ISTమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించిన చిట్టచివరి సినిమా గుజారిష్. 2010లో రిలీజైందీ సినిమా. ఆ తర్వాత ముఖానికి రంగేసుకున్నదే లేదు. ఆరాధ్య జన్మించాక పూర్తిగా తన ఆలనాపాలన కోసమే సమయాన్ని కేటాయించాల్సొచ్చింది. అయితే ఆరాధ్య ఇప్పుడు ఐదేళ్ల పాపాయి కాబట్టి కాస్త వెసులుబాటు దొరికింది. ముఖానికి రంగేసుకునేందుకు ఛాన్సొచ్చింది.
అందుకే ఇప్పుడు ఐశ్వర్యారాయ్ రీఎంట్రీకి రెడీ అవుతోంది. అంతేకాదు.. పునరారంగేట్రమే దర్శకనిర్మాతలతో ప్రాఫిట్స్ లో షేరింగ్ గురించి ముచ్చట్లాడుతోంది. కండిషన్లు అప్లయ్ అని చెబుతోంది. లాభాలొస్తే అందులోంచి కొంత వాటా ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న జజ్బా చిత్రానికి ఈ డిమాండ్. అయితే ఇలా డిమాండ్ చేస్తున్నారా? అని అడిగితే మాత్రం ఆంటీగారికి కోపం వచ్చింది. కాస్త సీరియస్ గానే.. ఇలా అంది.
ఒకసారి నటి అయ్యాక ప్రొఫెషనల్ గా ఉంటాం అంతే. నటి నటి మాత్రమే. గ్యాప్ వచ్చిందనో, వేరొక కారణం వల్లనో కమిట్ మెంట్ మారదు. నటనలో పూర్తిగా సంతృప్తిపరిచే ప్రదర్శన ఇచ్చామా? లేదా? అన్నదే ముఖ్యం. పెళ్లికి ముందు, పెళ్లయ్యాక, గర్భిణిగా ఉన్నప్పుడు ప్రతిసారీ నా వృత్తికి అంకితమై పనిచేశాను. ఏనాడూ ద్రోహం చేయలేదని ఐష్ ఫైరైంది.