Begin typing your search above and press return to search.

వయస్సు మళ్ళిన ఐశ్వర్య సీక్రెట్‌

By:  Tupaki Desk   |   18 May 2016 1:00 PM IST
వయస్సు మళ్ళిన ఐశ్వర్య సీక్రెట్‌
X
ఓ రియల్ లైఫ్ కేరక్టర్ ఎప్పడూ సవాలే. ఆ కేరక్టర్ బతికే ఉన్నపుడు ఆ రోల్ ని చేయడం ఛాలెంజ్ అనే చెప్పాలి. సరబ్ జిత్ మూవీలో ఐశ్వర్యారాయ్ పోషించిన దల్బీర్ కౌర్ పాత్ర ఇలాంటిదే. ఈ మూవీలో 22 నుంచి 52 ఏళ్లవరకూ పలు రకాల వయసుల్లో ఐశ్వర్యారాయ్ కనిపించాలి. 30 ఏళ్లపాటు తన అన్నని విడిపించుకోవడానికి పడ్డ కష్టంతో పాటు.. వయసు రీత్యా వచ్చిన మార్పులను కూడా చూపాలి. అలా వయస్సు మళ్ళిన భామలా కనిపించడం వెనుక సీక్రెట్‌ ఏమైనా ఉందా?

దల్బీర్ పాత్రకు ఐష్ ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెప్పినపుడు మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షిండే సంతోషించాడట. 'ఐశ్వర్య ఎలా కనిపించాలనే అంశంపై దర్శకుడుకి స్పష్టమైన విజన్ ఉంది. ఈ మూవీలో ఐశ్వర్య చేసినది డీగ్లామర్ పాత్ర అనే చెప్పాలి. వీలైనంత సహజంగా ఐశ్వర్య అందాన్ని చూపాలని అనుకున్నాం. 22-30 ఏళ్ల యువతిగా ఐష్ ను చూపించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆమె ఫేస్ లో ఉన్న నునుపు, మెరుపు అందుకు సహకరిస్తాయి' అంటున్నాడు సుభాష్.

30-40 మధ్య లుక్ కోసం ఐష్ ఫేస్ లోని గ్లో తగ్గించడానికి కొంత డల్ షేడ్స్ ఉపయోగించామని.. ఇక 40-52 ఏళ్ల మధ్య మహిళగా కనిపించేందుకు ఆమె ఫేస్ పై పలు ప్రయోగాలు చేశామని చెబుతున్నాడు ఈ మేకప్ ఆర్టిస్ట్. ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాత చివరకు ఫైనల్ చేశారట. అంతవరకూ ఎంతో ఓపిగ్గా సహకరించిన ఐష్ కి థ్యాంక్స్ చెబుతున్నారు మేకప్ టీం.