Begin typing your search above and press return to search.

ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి ఐష్ ని తొలగించినట్లేనా...?

By:  Tupaki Desk   |   24 July 2020 1:20 PM IST
ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి ఐష్ ని తొలగించినట్లేనా...?
X
లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు మరియు ఐశ్వర్యారాయ్ - త్రిష - శోభితా ధూళిపాళ్ల తదితరులు నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆపుకున్న ఈ సినిమా పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి అందాల నటి ఐశ్వర్యారాయ్ ని తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమా నాలుగేళ్ళ క్రితం స్టార్ హీరోలు మహేష్ బాబు - విజయ్ లతో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి ఇన్నేళ్ల తర్వాత వేరే స్టార్ క్యాస్ట్ తో పట్టాలెక్కింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ అయిన కొన్ని రోజులకు కొంత బ్రేక్ ఇచ్చారు. ఇక కరోనా క్రైసిస్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న మణిరత్నం కి మరోసారి చిత్రీకరణ వాయిదా వేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐష్ కి కరోనా రావడంతో హాస్పిటల్ చికిత్స తీసుకుంటోంది. దీంతో ఇప్పటికే డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి మళ్ళీ బ్రేక్స్ పడే ఛాన్స్ ఉండటంతో ఐశ్వర్యని ఈ సినిమా నుంచి తొలగించాలని డెసిషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.