Begin typing your search above and press return to search.

ఐసూ.. అసలు ఇది సాధ్యమా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 11:43 PM IST
ఐసూ.. అసలు ఇది సాధ్యమా?
X

దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా ఉంటుంది అని ఐశ్వర్యారాయ్‌ని చూపించాల్సిందే. లేటెస్టుగా ఐష్‌ ఫోటో షూట్‌ చూసిన వారికి ఇది రియల్‌ షాకింగ్‌ అనిపించక మానదు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయ్యాక ఇంత లేటు వయసులో ఇలాంటి సొగసుల్ని ప్రదర్శిస్తోంది అంటే అసలు ఐష్‌లోని గట్స్‌ని పొగిడేయకుండా ఉండలేం.

ప్రఖ్యాత 'హలో' మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం ఐష్‌ ఇచ్చిన ఫోజులు ఆన్‌ లైన్‌ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. 35 వయసు దాటాక కూడా ఇంతటి అందాన్ని, రూపలావణ్యాన్ని చూపించడం అంటే అదొక వండర్‌ అనాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో ఇద్దరు సినిమాతో కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఐశ్వర్యారాయ్‌ ఎలా ఉండేదో .. ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బొద్దుతనంతో కనిపించిన ఐష్‌.. తీవ్రమైన కసరత్తులు చేసి ఇలా రూపాన్ని మార్చుకుంది.

పూర్వం దేవతలు అమృతం తాగి నిత్య యవ్వనులుగా ఉన్నారని పురాణాల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఐష్‌ రూపురేఖలు చూశాక, అమృతం తాగిన దేవతల్లో తను కూడా ఒకత్తె అయి ఉంటుందేమో అనిపించక మానదు.