Begin typing your search above and press return to search.

అంబానీ వేడుకలో ఐష్‌ అదరగొట్టింది

By:  Tupaki Desk   |   27 March 2018 11:04 AM IST
అంబానీ వేడుకలో ఐష్‌ అదరగొట్టింది
X
ఇండియాలో ఎవ్వరైనా సరే గుర్తుపట్టే ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది అంబానీ ఫ్యామిలీ అనే చెప్పాలి. అప్పుడప్పుడు అంబానీ అనే పేరును సరదాగా వాడడం ఈ రోజుల్లో కామన్. ఎంతో సంపన్నులు అయిన వారి ఇంట్లో చిన్న వేడుక జరిగితే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ మాత్రం తగ్గకుండా కోట్లు ఖర్చు పెడుతుంటారు. అయితే చాలా కాలం తరువాత అంబానీ హౌస్ లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.

రిలయన్స్ ఇండిస్ట్రీ ఓనర్ ముకేష్ అంబానీ పెద్ద కుమారుడి వివాహనికి సర్వం సిద్ధమవుతోంది. వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతా - ఆకాష్ వివాహం కోసం రీసెంట్ గా ఇరు కుటుంబాలు పరిచయ విందును ఏర్పాటు చేశాయి. గోవాలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖ తారాగణం దిగివచ్చింది. కత్రినాకైఫ్ షారుక్ ఖాన్ పార్టీలో స్పెషల్ గా మెరిశారు. ఇక అందరికంటే ఎక్కువగా పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది బచ్చన్ లేడీస్ అని చెప్పాలి.

ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరియు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఐశ్వర్య అయితే ఇంకా పాతికేళ్ల యువతిలనే కనిపించింది. హాఫ్ షోల్డర్ బ్లాక్ డ్రెస్ తో మోడ్రన్ లుక్ యాడ్ చేసింది. క్లీవేజ్ సోయగాలతో ఉర్రూతలూగించింది. ఆమె గారాల కూతురు ఆరాధ్య చాలా క్యూట్ గా కనిపించి తల్లిని డామినేట్ చేసింది. ఇక శ్లోక మెహతా - ఆకాష్ గత ఐదేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నారు. స్కూల్ దశ నుంచి వారికి పరిచయం ఉంది. అయితే వివాహాన్ని డిసెంబర్ 8 నుంచి 12 వరకు ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తం ఐదు రోజుల వరకు సంబరాలు జరగనున్నాయి. ఇక జూన్ లో నిశ్చితార్థం జరపడానికి ఇరుకుటుంబాలు డిసైడ్ అయ్యాయి.